Social Media Violations: ముక్కులో వేలు పెట్టుకుని వీడియో తీస్తే సోషల్ మీడియా నుంచి బహిష్కరణే..
Social Media Violations: చైనా దేశానికి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీచాట్ కొత్త యాప్ యూజర్ల కొసం కొత్త నిబంధనలను జారీ చేసింది.
Social Media Violations: చైనా దేశానికి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీచాట్ కొత్త యాప్ యూజర్ల కొసం కొత్త నిబంధనలను జారీ చేసింది. అదేంటంటే.. యూజర్ ముక్కులో వేలు పెట్టుకుని వీడియో పోస్ట్ చేసినట్లయితే వెంటనే ఆ ప్లాట్‌ఫాం నుంచి తొలగించబడుతుందని తేల్చి చెప్పింది. ఈ బహిష్కరణాస్త్రం కొత్త నిబంధనల్లో భాగమని, యూజర్లు ఎవరూ ఇలా చేయకూడదంది. అంతేకాకుండా చిన్న పిల్లలను కొడుతున్న వీడియోలు పెట్టినా కూడా వెంటనే వి చాట్ నుంచి యూజర్లను తొలగిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్ లైవ్ స్ట్రీమింగ్ సేవను మెరుగుపరిచేందుకే వీచాట్ ఈ విధానాన్ని కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది.
టెన్సెంట్ హోల్డింగ్ యాజమాన్యంలోని వీచాట్.. చైనా దేశవ్యాప్తంగా బాగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ యాప్‌ని వినియోగించే వారి సంఖ్య బిలియన్ కంటే ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీని ద్వారా, ప్రజలు మెసేజింగ్ నుండి పిజ్జా ఆర్డరింగ్ వరకు అన్ని రకాల పనులు చేసుకుంటారు. అంతేకాదు.. వీచాట్ ‘ఛానల్’ ఫీచర్ 2020 లో ప్రారంభించబడింది. దీని ద్వారా ప్రజలు లైవ్ స్ట్రీమ్ కూడా చేయగలరు. ఇదిలాఉంటే.. చైనా సర్కార్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిశితంగా గమనిస్తుంది. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాజకీయ, సాంస్కృతిక పరమైన సున్నితమైన అంశాలను ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వెంటనే తొలగిస్తుంది.
టాన్సెట్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుబడి.. రాజకీయ కార్యకలాపాలను పెంచడానికి, అశ్లీలతను తగ్గించడానికి చైనా ప్రభుత్వ అధికారులు వీచాట్ ఛానల్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంగా, వీ చాట్ లో కంటెంట్ నియంత్రణకు సంబంధించి కొత్త నియమాలను రూపొందించాలని చైనా సర్కార్.. టాన్సెట్ పై ఒత్తిడి తీసుకువచ్చింది. కాగా, కమ్యూనిస్ట్ పార్టీ టాన్సెట్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. చైనా ప్రభుత్వం తన ఇమేజ్‌ను మెరుగుపరచడానికి ఈ వేదికను కూడా ఉపయోగిస్తుంది. అందుకే టెన్స్‌ట్‌కు కొత్త నిబంధనలు రూపొందించడం మినహా మరో మార్గం లేదు.
వి చాట్ యాప్‌లో వీటికి నాట్ అలౌడ్.. వి చాట్ లోని ఒక పోస్ట్‌లో, లైవ్ స్ట్రీమ్ సేవను పర్యవేక్షించే 70 సాధారణ ఉల్లంఘనలను యాప్ సెక్యూరిటీ సెంటర్ తయారు చేసింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఈ ఉల్లంఘనలకు పాల్పడొద్దని వి చాట్ తన వినియోగదారులను కూరొంది. ముక్కులో వేలు పెట్టుకోవడం, చెంపదెబ్బ కొట్టడం, ఇతర అశ్లీల చర్యలను కూడా నిషేధించారు. ఒకరి తలపై లోదుస్తులు ధరించడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను కెమెరాలో చూపించడం నేరంగా పరిగణించనున్నట్లు టెన్సెట్ స్పష్టం చేసింది.
అలాగే.. పచ్చబొట్లు చూపించడం, బికినీలలో వీడియోలు తయారు చేయడం, శరీరాన్ని బెడ్‌షీట్లతో కప్పడం కూడా ఉల్లంఘనగా పరిగణించబడింది. రాజకీయ పరమైన సున్నితమైన విషయాలను ప్రసారం చేయడం, బార్‌లు, నైట్‌క్లబ్‌లు వంటి ప్రదేశాల నుండి జూదం, లైవ్‌స్ట్రీమింగ్‌ను ప్రోత్సహించడం కూడా నిషేధించబడింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ఎలాంటి ఉల్లంఘన చేసినా యూజర్‌కు జరిమానా విధించడం జరుగుతుందని వి చాట్ తేల్చి చెప్పింది.
Also read: