Raja Raja Chora Teaser: రాజ రాజ చోర టీజర్ విడుదల.. గంగవ్వతో శ్రీవిష్ణు మందు పార్టీ..
విలక్షణ పాత్రలతో.. మంచి కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు.. తాజాగా ఆయన హసిత్ గోలి దర్శకత్వంలో 'రాజ రాజ చోర'

విలక్షణ పాత్రలతో.. మంచి కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు.. తాజాగా ఆయన హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన రాజ రాజ చోర్ బై గంగవ్వ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్.
టీజర్ చూస్తుంటే.. హీరో శ్రీ విష్ణు.. ఒకవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా..మరో వైపు దొంగగా కనిపించాడు. అయితే తన ఉద్యోగంపై ఎవరికీ అనుమానాలు కలగకుండా.. తాను ఇంగ్లీస్ నేర్చుకునేందుకు కష్టపడుతూ నవ్వించే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. టైటిల్ సాంగ్ ఇప్పటికే కామన్ ఆడియన్స్ కు చేరుకోగా.. ట్రైలర్ కూడా ఆధ్యంతం ఆసక్తికరంగా ఉండటంతో.. ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. పురాతన రాజ్యంలోని రాజుకు సంబంధించిన నగల దొంగతనంపై సాగే కథను.. కామెడీగా చూపించినట్లు తెలుస్తుంది. ఇందులో గంగవ్వతో శ్రీవిష్ణు మందు పార్టీ చేసుకుంటున్నట్లుగా చూపించారు. కానీ ఈ మూవీలో గంగవ్వ క్యారెక్టర్ ఏంటనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. రాజ రాజ చోర టీజర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన శ్రీవిష్ణు.. ఈ పాత్రతో మీ ముందుకు రావడం నా అదృష్ణం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వినస్తానన్నది నా శపథం అని ట్వీట్ చేశారు.
ట్వీట్..
ఈ పాత్రతో మీ ముందుకి రావడం నా అదృష్టం.ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం!?
Teaser of #RajaRajaChora ?https://t.co/0THRyIfnZV@akash_megha @TheSunainaa @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @hasithgoli @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/LlPMishLl8
— Sree Vishnu (@sreevishnuoffl) June 18, 2021
వీడియో..




