RC 15 Movie: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మేకర్స్.. రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్‏లో అలా..

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు పలు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది

RC 15 Movie: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మేకర్స్.. రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్‏లో అలా..
Rc 15
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2022 | 12:00 PM

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు పలు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ క్రమంలో తెలుగు చిత్రపరిశ్రమకు పైరసీ, లీక్ కష్టాలు వచ్చి పడ్డాయి. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలపై లీకుల రాయుళ్లు విరుచుకుపడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. సినిమా సాంగ్స్, హీరోహీరోయిన్స్ షూటింగ్ వీడియోస్ నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమాకు లీకుల బెడద మరింత ఎక్కువైంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మాత్రమే కాకుండా..ఇటీవల కళావతి సాంగ్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ చిత్రాల పట్ల మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్ కష్టాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ లీక్ రాయుళ్లకు సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ క్రమంలో లీక్ రాయుళ్లకు వార్నింగ్ ఇస్తూ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు మేకర్స్.

“RC 15, SVC 50 చిత్రీకరణ సినిమా అవసరాలకు అనుగుణంగా బహిరంగా ప్రదేశాల్లో జనసందోహంతో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. చట్ట విరుద్ధంగా తీసిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట్లో షేర్ చేయకూడదని కోరుతున్నాము. అనధికారిక కంటెంట్ పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ వైరస్ టీమ్ చర్య తీసుకుంటుంది” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు మేకర్స్. మొత్తానికి ఇటీవల ఎక్కువవుతున్న లీక్స్ బెడదకు ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు దిల్ రాజు నిర్మాణ సంస్థ. ఇందులో రామ్ చరణ్ కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!