సోనూసూద్ ఫ్యాన్స్ గొప్ప మనసు.. 2500 కిలోల బియ్యంతో ఎకరా స్థలంలో రియల్ హీరో చిత్రపటం.. ఆపై ఏం చేశారో తెలుసా?
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పియడం దగ్గరి నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్ల వరకు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు సోనూసూద్. ఆయనను ఆదర్శంగా తీసుకున్న అభిమానులు కూడా సోనూ దారిలోనే నడుస్తున్నారు. ఊరూరా రక్తదాన కేంద్రాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రియల్ హీరోపై ..

సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా నిజ జీవితంలో మాత్రం అందరిచేత రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. కరోనా, లాక్‌డౌన్ సమయాల్లో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పియడం దగ్గరి నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్ల వరకు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు సోనూసూద్. ఆయనను ఆదర్శంగా తీసుకున్న అభిమానులు కూడా సోనూ దారిలోనే నడుస్తున్నారు. ఊరూరా రక్తదాన కేంద్రాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రియల్ హీరోపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు సోనూసూద్‌పై వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా 2500 కిలోల బియ్యంతో రియల్ హీరో చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. ఒక ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూసూద్ రూపాన్ని తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న తుకోజీరావు పవార్ స్టేడియంలో సుమారు ఎకరా స్థలంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
కాగా సోనూసూద్ చిత్రం కోసం ఉపయోగించిన బియ్యాన్ని ‘హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన, కనీస సౌకర్యాలు లేని కుటుంబాలకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూసూద్ అభిమానుల గొప్ప మనసును మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సోనూసూద్ ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ‘ఫతే’ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ప్రముఖ టెలివిజన్ షో రోడీస్ రాబోయే సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ఇటీవలే తెలిపాడు సోనూసూద్.




Fans in Madhya Pradesh carve #sonusood‘s face using 2500 kilos of rice over one acre land which will be donated to the needy. pic.twitter.com/khVVS0rJ28
— Amit Karn (@amitkarn99) April 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..