- Telugu News Photo Gallery Cinema photos These young and news heroines are acting with Pawan Kalyan next movies telugu cinema news
Pawan Kalyan: కొత్త హీరోయిన్లకు ఛాన్స్‌లు ఇస్తోన్న పవర్ స్టార్.. పవన్‌తో జోడీ కడుతున్న ముద్దుగుమ్మలు వీళ్లే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కల. ఆయనతో కలిసి పనిచేసేందుకు స్టార్స్ హీరోయిన్స్ సైతం వెయిట్ చేస్తుంటారు. ఆయనతో కలిసి నటిస్తే స్టార్ హీరోయిన్ రేంజ్ వస్తుందని ఆశపడుతుంటారు.
Updated on: Apr 12, 2023 | 11:25 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కల. ఆయనతో కలిసి పనిచేసేందుకు స్టార్స్ హీరోయిన్స్ సైతం వెయిట్ చేస్తుంటారు. ఆయనతో కలిసి నటిస్తే స్టార్ హీరోయిన్ రేంజ్ వస్తుందని ఆశపడుతుంటారు.

కానీ ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్లకు పవన్ సినిమాలో ఛాన్సులు వస్తున్నాయి. పవర్ స్టార్ నటిస్తోన్న అన్ని చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్ నటిస్తుండడం విశేషం.

అలాగే అవుడ్ డీటెడ్ హీరోయిన్స్ కూడా అవకాశాలు అందుకుంటున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ కథానాయికగా నటించింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.

ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్.. జాక్వలెన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలో పవన్ జోడిగా నటించే చాన్స్ శ్రీలీల సొంతం చేసుకుంది. ఇటీవలే సెట్ లో అడుగుపెట్టింది.

డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ చిత్రంలో ప్రియంకా అరుల్ మోహన్ నటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ నెక్ట్స్ సినిమాలన్నింటిలో కొత్త హీరోయిన్లు కనిపించనున్నారు.

క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్.. జాక్వలెన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.




