AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sodara Movie Review: సోదరా మూవీ రివ్యూ.. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సంపూర్ణేష్ బాబు హిట్ కొట్టాడా?

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన సినిమా ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో సంజోష్, ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Sodara Movie Review: సోదరా మూవీ రివ్యూ.. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సంపూర్ణేష్ బాబు హిట్ కొట్టాడా?
Sodara Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Basha Shek|

Updated on: Apr 25, 2025 | 5:48 PM

Share

మూవీ రివ్యూ: సోదరా

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్ తదితరులు

ఎడిటింగ్: శివ శ్రావణి

ఇవి కూడా చదవండి

సంగీతం: సునీల్ కశ్యప్

నిర్మాత: చంద్ర చగన్లా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మన్మోహన్ మేనంపల్లి

కథ:

తెలంగాణలోని ఓ పల్లెటూరు.. అందులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. పెద్దోడు చిరంజీవి ఫ్యామిలీ సోడా బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఈ అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వయసు పెరిగినా పెళ్లవ్వట్లేదని.. వచ్చిన సంబంధాలన్నీ పాడైపోతున్నాయని బాధ పడుతుంటాడు చిరంజీవి. అలాంటి సమయంలో చిరంజీవి ఎదురింట్లో దివి(ఆర్తి గుప్తా) కుటుంబం దిగుతుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడి ట్రై చేస్తూ ఉంటారు. తమ్ముడ్ని తప్పించాలని పవన్ ని వేరే ఊరుకి చదువుకోడానికి పంపిస్తాడు చిరంజీవి. అదే సమయంలో చిరంజీవి ప్రేమని దివి రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు కాలేజీ చదువుల కోసం వెళ్ళిన పవన్.. భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు. సెలవుల్లో ఇంటికి వచ్చిన పవన్ కి తన అన్నయ్యని దివి రిజెక్ట్ చేసిన విషయం తెలుస్తుంది. దాంతో చిరంజీవిని రెచ్చగొట్టి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లేలా చేస్తాడు పవన్. అప్పుడు రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ అయి.. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివి ఫ్యామిలీ. దీంతో తమ్ముడు పవన్ మీద కోపం తెచ్చుకుంటాడు చిరంజీవి. ఆ తర్వాత ఏం జరిగింది.. చిరంజీవికి పెళ్లయిందా.. ప్రేమించిన అమ్మాయి తో పవన్ ఏడడుగులు నడిచాడా లేదా.. గొడవ పడిన అన్నదమ్ములు మళ్ళీ కలిసారా లేదా అనేది మిగిలిన కథ..

కథనం:

మామూలుగా సంపూర్ణేష్ బాబు అంటే కాసేపు నవ్వుకోవడానికి థియేటర్ కు వస్తారు ఆడియన్స్. కానీ సోదరా సినిమాలో మాత్రం కామెడీ కాదు ఎమోషన్ ఉంటుందని ముందు నుంచి ప్రమోట్ చేశారు. వాళ్ళు చెప్పినట్టే సినిమాలో కామెడీ కంటే ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ వైపు ఫోకస్ చేశాడు దర్శకుడు మన్మోహన్. ఫస్ట్ హాఫ్ అంతా అన్నదమ్ముల ఎలివేషన్ గురించి చూపించాడు. ఫస్ట్ ఆఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేసినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాలేజీ సీన్స్ కూడా సాగదీశారు. కాలేజీ సీన్స్, పవన్ లవ్ స్టోరీ ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేది. ఇంటర్వెల్ కి ఒక మంచి ట్విస్ట్ రాసుకున్నాడు దర్శకుడు. దాంతో సెకండ్ హాఫ్ ఏమవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఓ పక్క కామెడీ, మరో పక్క లవ్, బ్రదర్స్ ఎమోషన్.. ఇలా మేజర్ పోర్షన్స్ అని సెకండాఫ్ లోనే ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ లు ఇచ్చి ఆసక్తిగా ముగించారు. సినిమా అంతా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే.. ఎక్కడ ట్రాక్ తప్పకుండా రియలిస్టిక్ గా చూపించ ప్రయత్నం చేశారు.

నటీనటులు:

చిరంజీవి పాత్రలో సంపూర్ణేష్ బాబు బాగా నటించాడు. రెగ్యులర్ గా చేసే కామెడీ కాకుండా ఇందులో కొద్దిగా కొత్తగా ట్రై చేశాడు. సంజోష్ పక్కా తెలంగాణ కుర్రాడిగా బానే సెట్ అయ్యాడు. ఆర్తి గుప్తా, ప్రాచీ బన్సాల్ బాగున్నారు తమ తమ పాత్రలకు న్యాయం చేస్తారు. చాలా ఏళ్ల తర్వాత సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కామెడీ పాత్రలో కాసేపు అలరించారు. గెటప్ శ్రీను అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. బాబా భాస్కర్ ఓకే.

టెక్నికల్ టీం:

సునీల్ కశ్యప్ సంగీతం పర్లేదు. పాటలు పెద్దగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సినిమా అంతా పల్లెటూరులోనే జరుగుతుంది కాబట్టి విజువల్స్ బాగానే చూపించారు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిందే. ఇక దర్శకుడు మన్మోహన్ కథ వరకు బాగానే రాస్తున్నాడు కానీ కథనం విషయంలో కాస్త గాడి తప్పాడు. ఫస్టాఫ్ ఇంకాస్త బాగుండి ఉంటే సినిమా ఫలితం మరొకలా ఉండేది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ‘సోదరా’.. రొటీన్ అన్నదమ్ముల డ్రామా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..