‘ఎక్స్పైరీ డేట్’ తో రాబోతున్న స్నేహా ఉల్లాల్
స్నేహా ఉల్లాల్‌ను చిన్న ఐశ్వర్యరాయ్ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. అందంలోనూ, అభినయంలోనూ స్నేహ..ఐశ్‌కు ఏమాత్రం తక్కువ కాదు.

స్నేహా ఉల్లాల్‌ను చిన్న ఐశ్వర్యరాయ్ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. అందంలోనూ, అభినయంలోనూ స్నేహ..ఐశ్‌కు ఏమాత్రం తక్కువ కాదు. కానీ ఎందుకో స్నేహ ఉల్లాల్ సినిమా ఇండస్ట్రీలో అంతగా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె.. త్వరలో ‘ఎక్స్పైరీ డేట్’ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను పలుకరించబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్.. అక్టోబరు చివర్లో రిలీజ్ కానుంది.
మొదట జూన్‌లో ప్రేక్షకుల ముందుగా తీసుకురావాలని అనుకున్నా, కరోనా ఎఫెక్ట్ కారణంగా అదికాస్త వాయిదా పడింది. ఈమెతో పాటు మధు షాలినీ, అలీ రెజా, భరత్ రెడ్డి తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరత్ మరార్ నిర్మించగా, శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. తన వైఫ్‌ను హింసాత్మకంగా మర్డర్ చేసిన ఓ వ్యక్తి జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనే పరిణామాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
Also Read :
ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ !




