AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్‌ను బీట్ చేస్తున్న సితార..

సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచుతున్నారు. అనిల్‌ రావిపుడి  ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ర‌ష్మిక‌,

సూపర్ స్టార్‌ను బీట్ చేస్తున్న సితార..
Sanjay Kasula
|

Updated on: Sep 01, 2020 | 6:31 AM

Share

సోషల్ మీడియాలో లిటిల్ కిడ్ సితార దుమ్మురేపుతోంది. తన డ్యాన్స్‌ లతో అదరగొడుతోంది. ఇలా పోస్ట్ చస్తుందో లేదో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం సితార డాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచుతున్నారు. అనిల్‌ రావిపుడి  ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ర‌ష్మిక‌, విజ‌య‌శాంతి ముఖ్య పాత్ర‌లు పోషించారు.

ఇప్పటికే ఇంగ్లీష్‌ పాటలతో పాటు తన తండ్రి ప్రిన్స్ మహేశ్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ పాటలకు స్టెప్పులేస్తూ..  హల్‌చల్‌ చేసిన సీతు పాప…తాజాగా అదే సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్‌’కి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి తండ్రిని మించిపోతోంది.

View this post on Instagram

#Repost @sitaraghattamaneni ・・・ This one is for you Nana?? hope you like it ♥️♥️ #SundayFunday @urstrulymahesh

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on