దాదా ప్రణబ్ మృతి పట్ల క్రికెటర్ల సంతాపం

మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు, క్రికెటర్లు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ రాష్ట్రపతితో తమకు అనుబంధాన్ని తెలియజేశారు ప్రముఖ క్రికెటర్లు.

దాదా ప్రణబ్ మృతి పట్ల క్రికెటర్ల సంతాపం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 31, 2020 | 10:29 PM

మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు, క్రికెటర్లు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా సోమవారం ట్విట్టర్‌ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2020 కోసం యూఏఈలో ఉన్న కోహ్లి.. భారతదేశం అద్భుతమైన నాయకుడిని కోల్పోయిందని ట్వీట్‌ చేశాడు. ‘దేశం ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది. ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్త విన్నందుకు బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం’ తెలియజేస్తూ కోహ్లీ ట్వీట్ చేశారు.

మరో క్రికెటర్ రోహిత్‌శర్మ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘రెస్ట్ ఇన్ పీస్.. ప్రణబ్ ముఖర్జీ జీ. మీరు దేశానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన ప్రియమైనవారికి నా సంతాపం’ అని స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ ట్వీట్‌ చేశాడు.

‘ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు హృదయపూర్వక సంతాపం. అతడి ఆత్మకు శాంతి కలుగుగాక.’ అని అనిల్ కుంబ్లే ట్వీట్ చేశారు.

‘మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు నా హృదయపూర్వక సంతాపం’ అని మాజీ బ్యాట్స్‌మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు.

మాజీ రాష్ట్రపతితో తమకు అనుబంధాన్ని తెలియజేశారు ప్రముఖ క్రికెటర్లు.