AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్‌లో ఎంతో కొంత జీవం ఉంచాలి : కృష్ణమాచారి శ్రీకాంత్‌

బరువైన బ్యాట్‌లు రావడం, తెల్ల బంతి పూర్తిగా స్వభావం మార్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాటింగ్ స్టైలే మారిపోయింది, మధ్యాహ్నం సమయంలో మ్యాచ్‌లు మొదలు కావడంతో పాటు పస లేని పిచ్‌లు రావడంతో బంతికో పరుగు చొప్పున చేయడం మామూలు అయ్యింది.

పిచ్‌లో ఎంతో కొంత జీవం ఉంచాలి : కృష్ణమాచారి శ్రీకాంత్‌
Balaraju Goud
|

Updated on: Sep 01, 2020 | 11:32 AM

Share

50 ఓవర్ల క్రికెట్‌ బాల్యావస్థలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై కూడా సగటున ఓవర్‌కు నాలుగు పరుగులే వచ్చేవి. ఆ తర్వాత బరువైన బ్యాట్‌లు రావడం, తెల్ల బంతి పూర్తిగా స్వభావం మార్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాటింగ్ స్టైలే మారిపోయింది, మధ్యాహ్నం సమయంలో మ్యాచ్‌లు మొదలు కావడంతో పాటు పస లేని పిచ్‌లు రావడంతో బంతికో పరుగు చొప్పున చేయడం మామూలు అయ్యింది. 150–160 స్కోరు చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే జట్టుకు కూడా సమాన విజయావకాశం ఉంటే మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. అభిమానులు అలాంటి మ్యాచ్‌లు చూసేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు టి20ల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి నిర్వాహకులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు మాజీ క్రికెట్ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్. లేదంటే వారి పరిస్థితి కూడా వన్డేలలాగే మారుతుందంటున్నారు. ఇక చివరి టి20 విషయానికి వస్తే ఇంగ్లండ్‌ చాలా బలంగా కనిపిస్తుండగా, ముందుగా బ్యాటింగ్‌ చేస్తే పాకిస్తాన్‌ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వికెట్‌ను చూస్తే ఎంతటి లక్ష్యమైనా ఛేదించవచ్చని అనిపిస్తుంది. ఈ స్థితిలో టాస్‌ కీలకం. పాక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని ఇంగ్లండ్‌ను 200 లోపు కట్టడి చేయగలిగితే సిరీస్‌ సమం చేసేందుకు వారికి మంచి అవకాశం లభిస్తుంది. ఊహించినట్లుగానే ఇంగ్లండ్‌ మెరుపు బ్యాటింగ్‌ లైనప్‌ ఆ జట్టుకు విజయాన్ని అందించింది. బంతికి, బ్యాట్‌కు మధ్య హోరాహోరీ పోరు జరిగే విధంగా పిచ్‌లో ఎంతో కొంత జీవం ఉంచాలి. కేవలం బౌండరీలు బాదడంలోనే పోటీ పడినట్లుగా మ్యాచ్‌ అనిపించకూడదు.ఈ రకంగా మరీ బౌలింగ్‌ పక్షాన కూడా అనుకూలత ఉండరాదు. నెమ్మదైన, టర్నింగ్‌ పిచ్‌లు రూపొందించడం తప్పు కాదంటున్నారు శ్రీకాంత్

Follow Us
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్‌బడ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్‌బడ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా