Singer Mangli: బోనాల పాట షూటింగ్‌లో మంగ్లీకి గాయాలు? సోషల్ మీడియా కథనాలపై స్పందించిన సింగర్
తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గాయపడింది. బోనాలకు సంబంధించి సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆమె కాలు జారి కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కాలికి గాయమైంది. యూనిట్ సభ్యులు మంగ్లీని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గాయపడినట్లు సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేశాయి. బోనాలకు సంబంధించిన సాంగ్ షూటింగ్ లో ఆమె కింద పడినట్లు కథనాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో మంగ్లీ కాలికి గాయమైందని, ఆస్పత్రికి కూడా తరలించారని వార్తలు ప్రచురితమయ్యాయి. తాజాగా ఈ కథనాలపై స్పందించింది సింగర్ మంగ్లీ. టీవీ9 ప్రతినిథితో మాట్లాడుతూ తనకు ఎలాంటి గాయాలు కాలేదని క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ బోనాలకు సంబంధించిన సాంగ్ అద్భుతంగా వస్తుందని, త్వరలోనే రిలీజ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కాగా తెలంగాణలోని బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా ఒక ప్రైవేట్ సాంగ్ చేస్తోంది మంగ్లీ. తన సుమధురమైన గాత్రాంతో సంగీత ప్రేక్షకులను ఓల ఓల లాడిస్తోన్న మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.




యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన మంగ్లీ ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీయెస్ట్ సింగర్‌గా మారిపోయింది. శైలజారెడ్డి అల్లుడి సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించింది మంగ్లీ. ఆతర్వాత నీది నాది ఒకే కథ, జార్జ్ రెడ్డి, అల వైకుంఠపురం, సిటీమార్, లవ్ స్టోరీ, రంగ్ దే, అల్లుడు అదుర్స్, క్రాక్, పెళ్లిసందD, పుష్ప (కన్నడ), విక్రాంత్ రోణ, ధమకా, మైఖేల్, బలగం, దాస్ కా ధమ్కీ వంటి హిట్ సినిమాల్లో పాటలు ఆలపించింది. ఇక గువ్వ గోరింక, మ్యాస్ట్రో సినిమాల్లో నటిగానూ ఆకట్టుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




