KS Chitra: నువ్వు లేకుండానే మా జీవితం సాగిపోతుంది.. కూతురిని గుర్తుచేసుకుంటూ చిత్ర ఎమోషనల్ నోట్..
ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏ.ఆర్.రెహమాన్, యేసుదాస్, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. ఆమె గాత్రానికి అభిమానులు ఎందరో. తన అద్భుతమైన గాత్రంతో వేలాది పాటలను అందించారు. సంగీత ప్రపంచంలో తనకంటూ పేజీని లిఖించుకున్న చిత్ర వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతులేని విషాదం దాగుంది.
కేఎస్. చిత్ర. ఈ పేరు తెలియని వారుండరు. తన తీయనైన గొంతుతో వేలాది పాటలకు ప్రాణం పోశారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో దాదాపు 25వేలకు పైగా పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళంలోనే కాకుండా.. మలాయ్, లాటిన్, అరబిక్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ విదేశీ భాషల్లో ఎన్నో సాంగ్స్ పాడారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏ.ఆర్.రెహమాన్, యేసుదాస్, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. ఆమె గాత్రానికి అభిమానులు ఎందరో. తన అద్భుతమైన గాత్రంతో వేలాది పాటలను అందించారు. సంగీత ప్రపంచంలో తనకంటూ పేజీని లిఖించుకున్న చిత్ర వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతులేని విషాదం దాగుంది. తన పాటలతో శ్రోతల మనసులను తేలిక చేసే చిత్ర గుండెల్లో మాత్రం ఎంతో దుఃఖం దాగుంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టిన తన కూతురు అకాల మరణం..
గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్ అనే ఒక ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 18 డిసెంబర్ 2002లో వీరికి నందన అనే అమ్మాయి జన్మించింది. ఆ పాప డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడేది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే 2011లో ఓ కచేరిలో పాల్గొనడానికి చిత్ర వెళ్లగా.. అదే సమయంలో స్విమ్మింగ్ పూల్లో పడి కన్నుమూసింది. ఈరోజు చిత్ర కూతురు మరణించిన రోజు. ఆమెను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నోట్ షేర్ చేసింది చిత్ర.
“మా హృదయాలు నీ జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. మేము నీ గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నాము. నువ్వు లేకుండానే మా జీవితం ముందుకు సాగిపోతుంది. కానీ ఇది ఎప్పటికీ ఒకేలా మాత్రం ఉండదు. మీ ప్రియమైన నందన నిన్ను ప్రేమగా స్మరించుకుంటున్నాము” అంటూ కూతురి ఫోటోను షేర్ చేశారు చిత్ర.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.