Samantha: సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా..? సింగర్ చిన్మయి ట్వీట్..
ఇటీవలే చైతూ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అలాగే సామ్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతుంది.. కానీ ఇప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో ఈ జంటకు సంబంధించి నిత్యం ఏదోక న్యూ్స్ వైరలవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించడంతో అటు సినీ ప్రముఖులతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ఇద్దరూ విడిపోవడానికి కారణాలు సరిగ్గా తెలియనప్పటికీ.. చైతూ, సామ్ తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే చైతూ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అలాగే సామ్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
చైతూ, సామ్ విడిపోవడానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తీరుతో సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ ఇబ్బంది పడ్డారని.. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని.. అలాగే చైతూ, సామ్ విడాకులకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కొండ సురేఖా వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మీ రాజకీయాల కోసం సినీ తారల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించారు. తాజాగా సామ్ స్నేహితురాలు సింగర్ చిన్మయి కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మైలేజ్, వ్యూస్, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా అంటూ మండిపడ్డారు.
సింగర్ చిన్మయి ట్వీట్..
“మీ ఎజెండా కోసం, మైలేజ్, వ్యూస్, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా ? అందరి దృష్టి మీవైపు మళ్లడం కోసం సమంతను అస్ర్తంలా ఉపయోగిస్తున్నారని అర్థమవుతుంది. కానీ మీ అందరికంటే తానెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి” అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సైతం కొండ సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.
End of the day all it proves is that…
— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024
కోన వెంకట్ ట్వీట్..
“అక్కినేని నాగార్జున గారి కుటుంబంపై తెలంగాణ కేబినెట్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు విని నేను షాక్ అయ్యాను.. నేను ఆమె ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీశ్రీ రేవంత్ గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, ఆమె చేసిన అవమానకరమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆమెపై నాకు అపారమైన గౌరవం ఉంది” అంటూ ట్వీట్ చేశారు.
I’m shocked at the comments made by one lady Cabinet Minister of Telangana against Akkineni Nagarjuna gari family.. I strongly condemn her every word and I request our Honourable Chief Minister Sri @revanth_anumula garu on whom I have immense respect, to take this matter…
— KONA VENKAT (@konavenkat99) October 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.