Silk Smitha: నిషా కళ్ల మయూరం సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో తెలుసా..?

కవ్వించే చూపులు.. కనువిందు చేసే అందాలు.. మత్తెక్కించే డ్యాన్సులు.. 80's-90' దశకంలో దేశమంతా ఆమె ఓ సంచలనం.. కంటిచూపుతో వైల్డ్‌ ఫైర్‌ పుట్టించింది.. చనిపోయి 28 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆమె తలపులు మత్తెక్కిస్తూనే ఉన్నాయి.. ఆమెవరో ఈ పాటికే అర్థమైపోయింటుంది కదా..? యస్.. మీ ఊహ నిజమే.. వన్ అండ్ ఓన్లీ సిల్క్ స్మిత జయంతి సందర్భంగా స్పెషల్ ఫోకస్...

Silk Smitha: నిషా కళ్ల మయూరం సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో తెలుసా..?
Silk Smitha
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 02, 2024 | 3:07 PM

హాలీవుడ్‌కు ఓ మర్లీన్ మన్రో ఉన్నారు.. అలాగే ఇండియాకు కూడా ఉన్నారు.. ఆమెవరో కాదు మన సిల్క్ స్మిత. చనిపోయి దాదాపు మూడు దశాబ్ధాలవుతున్నా సిల్క్ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలమే. ఆమె గురించి ఏ జనరేషన్‌ను అడిగినా ఎంతోకొంత తెలుస్తుంది. అంతగా అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సిల్క్ స్మిత. దక్షిణాదినే కాదు.. ఇండియన్ సినిమాలో ఎంతోమంది స్పెషల్ సాంగ్స్ చేసే హీరోయిన్స్ ఉన్నా.. సిల్క్‌ స్మిత వేరు. ఆమె టాలెంటే వేరు..! సిల్క్‌ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. 1979లో మొదటిసారి ఆమెకు రెగ్యులర్‌ సినిమా చేసే అవకాశం దక్కింది. వండి చక్రం అనే సినిమాలో ఆమె క్యారెక్టర్‌ పేరు సిల్క్‌..! దాంతోనే ఆమె ఇంటి పేరు సిల్క్‌గా స్థిరపడిపోయింది.

మొదటి సినిమా పాత్ర పేరే ఇంటి పేరుగా మారిపోయిందంటే.. అందులో సిల్క్ స్మిత కారెక్టర్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో 450పైగా సినిమాలు చేసి.. దక్షిణాదిన సిల్క్ అంటే ఓ బ్రాండ్ అని నిరూపించుకున్నారు. ఆమె బ్రాండ్.. చనిపోయిన 28 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ అలాగే పదిలంగా ఉంది. 1979లో మొదలైన సిల్క్ సినీ ప్రయాణం.. 17 ఏళ్ళ పాటు దిగ్విజయంగా కొనసాగింది. ఒకానొక సమయంలో సిల్క్ స్మిత పాట లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా కొనని పరిస్థితులు ఉండేవి.. అలాంటి స్టార్ డమ్ చూసిన ఈ లెజెండరీ నటి.. 1996, సెప్టెంబర్ 23న చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. సిల్క్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

కష్టాలు అనేవి చిన్ననాటి నుంచే సిల్క్ స్మిత చుట్టూ ఉన్నాయి. ఆమె పుట్టినప్పటి నుంచే పేదరికం వెక్కిరించింది. దాంతో 4వ తరగతిలోనే చదువుకు కూడా స్వస్తి చెప్పింది. అక్కడ్నుంచి మద్రాస్ రైల్ ఎక్కి.. ఎలాగైనా నటి కావాలనే కోరికతో తన అత్త ఇంటికి చేరింది. తన పేరు స్మితగా మార్చుకుంది. అలా 1980లో వచ్చిన వండి చక్రం సినిమాలో సిల్క్ పాత్రతో గుర్తింపు తెచ్చుకుని.. సిల్క్ స్మిత అయిపోయింది. వండి చక్రంలో సిల్క్ పాత్ర సక్సెస్ కావడంతో ఎక్కువగా ఆమెకు అలాంటి వ్యాంప్ తరహా పాత్రలే వచ్చాయి. పైగా మలయాళంలోనూ కెరీర్ కొత్తలో కొన్ని అడల్ట్ రేటెడ్ సినిమాలు చేసింది సిల్క్. దాంతో ఆమెలోని నటిని చూడటం మానేసారు దర్శకులు.. కేవలం ఐటం గాళ్‌గానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. స్మిత కూడా నటిగా నిరూపించుకోవాలని ఎదురు చూసి చూసి అలిసిపోయింది.

వరసగా ఐటం సాంగ్స్‌తో పాటు వ్యాంప్ తరహా పాత్రలు చేస్తున్నా కూడా.. మధ్య మధ్యలో సీతాకోకచిలక లాంటి సినిమాలతో తనలోని నటిని పరిచయం చేసారు స్మిత. కానీ పరిస్థితులు ఆమెను వ్యాంప్ పాత్రలకు పరిమితం చేసాయి. సినిమాల్లో అలా ఉన్నా.. నిజ జీవితంలో మాత్రం జగమొండితో పాటు నిజాయితీగా బతికారు సిల్క్. ఎవరైనా తన దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే.. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇండియన్ సినిమాలో మరే ఐటం గాళ్‌కు లేని.. రాలేని.. ఇకపై రాబోని క్రేజ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఓ సమయంలో హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు సిల్క్. ఆమె పాట కోసం పడిగాపులు కాసి నిరాశ పడిన నిర్మాతలెందరో..! మరి ఆకాశంమంత ఎత్తులు చూసిన స్మిత జీవితం  దారుణంగా ముగిసిపోయింది..? నమ్మిన వాళ్లే మోసం చేశారు అంటుంటారు కొందరు ఆమెకు దగ్గరిగా మెలిగినవాళ్లు

సిల్క్ స్మిత అనేది పేరు కాదు బ్రాండ్.. ఆ బ్రాండ్‌ను చాలా మంది నిర్మాతలు సొమ్ము చేసుకున్నారు. 80ల్లో సిల్క్ పేరు చెప్తే చాలు.. టికెట్లు తెగేవి. కోట్లాది మంది అభిమానులకు ఆమె ఓ కలల దేవత. అగ్ర హీరోలు కూడా ఆమె కోసం వేచి చూసారు. 80ల్లోనే ఒక్కో పాటకు ఆమె 75 వేల నుంచి లక్ష రూపాయల పారితోషికం తీసుకున్నారంటే సిల్క్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం సిల్క్ స్మితకు ఇచ్చేవాళ్లు నిర్మాతలు. వద్దన్నా వచ్చిపడిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు.. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోకుండా బాక్సుల్లో పడిన ఎన్నో సినిమాలను.. సిల్క్ స్మితతో ఐటం సాంగ్ పెట్టండి.. మేం రిలీజ్ చేసి పెడతాం అంటూ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్స్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు.

స్టార్ హీరోల సినిమా అంటే సిల్క్ స్మిత పాట కచ్చితంగా ఉండాల్సిందే. ఆమె కోసం.. సిల్క్ ఇచ్చే డేట్స్ కోసం తమ షూటింగ్స్ కూడా ఆపుకున్న హీరోలున్నారు మన ఇండస్ట్రీలో. కానీ ఇంత సంపాదించినా.. ఆమె జీవితంలో ఏదో తెలియని శూన్యత అలాగే ఉంది. కొందరేమో మోసపోయిందంటారు.. మరికొందరు ఒంటరితనంతో విసిగిపోయిందంటారు.. ఇంకొందరేమో నమ్మినవాళ్లే మోసం చేసారంటారు.

ఎవరేమన్నా.. సిల్క్ స్మిత బ్రాండ్ వాడుకుని చాలా మంది లక్షలు సంపాదించారు. ఆమె మాత్రం జీవిత చరమాంకంలో మనోవేదనతో చనిపోయిందనేది వాస్తవం. ఆమె చనిపోయి కూడా కోట్లు సంపాదించి పెట్టింది. ఆ మధ్య విశాల్ హీరోగా వచ్చిన మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మితను AIలో చూపించారు.. అలాగే దసరాలోనూ సిల్క్ బార్ అంటూ ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చారు.

లక్షల్లో సంపాదన.. కోట్లల్లో ఆస్తులు.. వద్దన్నా వస్తున్న అవకాశాలు.. స్టార్ హీరోలే సిల్క్ స్మితకు అభిమానులు.. ఆమె ఊ అంటే క్యూ కట్టే నిర్మాతలు.. ఇలా రాజభోగాలన్నీ సిల్క్ కాళ్ల దగ్గర ఉన్నపుడు ఎందుకు ఆమె చూపులు నిర్మాణ రంగంవైపు వెళ్లాయి. ప్రొడక్షన్‌లోకి వెళ్లాలన్న ఆలోచనతోనే సిల్క్ పథనం మొదలైందని కొందరు చెబుతారు.

సిల్క్ స్మిత కెరీర్‌లో ఎప్పుడూ అవకాశాల కోసం వేచి చూసింది లేదు. ఆమెకు అస్సలు ఖాళీ అనే పదం కూడా లేదు. అందుకే కేవలం 17 ఏళ్ళ కెరీర్‌లో 450 సినిమాలు చేసారు. కాశ్మీర్ టూ కన్యాకుమారి అంటారు కదా.. అలా దేశమంతా సిల్క్ స్మిత జపం చేసారు అప్పట్లో. నటిగా సంపాదించింది నిర్మాణంలో పెట్టి పోగొట్టుకున్నారని ఆమె సన్నిహితులు చెప్తుంటారు. నిర్మాతగా మారడమే సిల్క్ చేసిన పెద్ద తప్పంటారు వాళ్లు.

డబ్బు విషయంలో ఎప్పుడూ ప్లానింగ్‌తో లేదు సిల్క్ స్మిత. అందరినీ నమ్మేది.. అదే అదునుగా ఆమె చుట్టూ చేరి కొందరు దోచుకున్నారని.. అలాగే మరొకరితో కలిసి ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెడితే.. అక్కడ కూడా మోసాలే ఆమెను వెక్కింరించాయంటారు. నమ్మిన సన్నిహితులే కొందరు ముంచేసారనే వాళ్లు లేకపోలేదు. అలా ఆర్థికంగా చితికిపోయింది సిల్క్.

సిల్క్ స్మిత జీవితంలో మరో కీలకమైన వ్యక్తి ఉన్నాడు.. అతడే డాక్టర్ బాబు ఉరఫ్ రాధాకృష్ణన్. సిల్క్ చనిపోయేంత వరకు ఆమెతో పాటు ఉన్నది ఈయనొక్కడే. అయితే సిల్క్ స్మిత తమ్ముడు మాత్రం తన అక్కను ఆ డాక్టరే చంపేసాడని చెప్పాడు. మరోవైపు ఆమె జీవితంపై వచ్చిన డర్టీ పిక్చర్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని తేల్చేసారు తమ్మారెడ్డి భరద్వాజ. తప్పో ఒప్పో తెలియదు కానీ చచ్చిపోయిన తర్వాత కూడా సిల్క్ స్మిత కొందరికి కోట్లు సంపాదించి పెట్టింది. ఆమె బయోపిక్‌గా వచ్చిన డర్టీ పిక్చర్ 13 ఏళ్ళ కిందే 100 కోట్లు వసూలు చేసింది. అలాగే మలయాళంలోనూ సనా ఖాన్ హీరోయిన్‌గా సిల్క్ జీవితంపై క్లైమాక్స్ అనే సినిమా వచ్చింది. అలా చనిపోయాక కూడా డబ్బులు తెచ్చింది.. కానీ ఆమె బతికున్నపుడు మాత్రం కష్టాలు చూసింది..

సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీనే. కానీ ఆమె సూసైడ్ నోట్ చూసిన వాళ్లు మాత్రం కచ్చితంగా జీవితంలో ఎంతో నష్టపోయి.. విసిగిపోయి.. తోడులేక చనిపోయిందని అర్థమవుతుంది. తన సూసైడ్ నోట్‌ను అభాగ్యురాలు అంటూ మొదలుపెట్టింది స్మిత. ‘దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను.. నాకు నావారు అంటూ ఎవరూ లేరు.. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు.. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు.. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు.. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే.. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు.. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు.. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది..?’ అంటూ కన్నీటి లేఖ రాసింది సిల్క్.

ఇంకా ఈ లేఖలో చాలా విషయం ఉంది.. ’నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్న. అతను నన్ను మోసం చేసాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేసాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. నా ఇష్టంగా నన్ను బతకనివ్వలేదు.. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు . నా రెక్కల కష్టం తినని వాళ్లు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును..’ అంటూ లేఖతో పాటు జీవితాన్ని ముగించింది సిల్క్.

ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిన ఆమె చిరునవ్వు వెనుక ఎన్నో కష్టాలు! వాలుచూపుల చాటున కన్నీటి ధారలు! ఎప్పుడూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు! హీరోయిన్లే ఇలా వచ్చి అలా తెరమరుగవుతున్న ఈ రోజుల్లో.. ఓ శృంగార తార మరణించిన 28 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకుల మదిలో అంత బలమైన ముద్ర వేయగలిగింది సిల్క్‌ స్మిత!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో .. ఏం రాసిందో తెలుసా..?
సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో .. ఏం రాసిందో తెలుసా..?
ఆసీస్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేనా.. దూసుకొస్తోన్న సౌతాఫ్రికా..
ఆసీస్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేనా.. దూసుకొస్తోన్న సౌతాఫ్రికా..
భార్య చేతుల మీదుగా కొత్త బైక్ స్టార్ట్ చేయించిన హర్ష.. వీడియో
భార్య చేతుల మీదుగా కొత్త బైక్ స్టార్ట్ చేయించిన హర్ష.. వీడియో
చిల్గోజా నట్స్‌ తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
చిల్గోజా నట్స్‌ తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
మళ్లీ పాన్ ఇండియా పాత ట్రెండ్ రిపీట్.. ఇదే కంటిన్యూ అవుతుందా.?
మళ్లీ పాన్ ఇండియా పాత ట్రెండ్ రిపీట్.. ఇదే కంటిన్యూ అవుతుందా.?
రాత్రి పూట ఈ తప్పులు చేస్తున్నారా..? పెను ప్రమాదంలో పడుతున్నట్లే
రాత్రి పూట ఈ తప్పులు చేస్తున్నారా..? పెను ప్రమాదంలో పడుతున్నట్లే
లండన్ వీధుల్లో బన్నీ ఫ్యాన్స్ అదరగొట్టారు..
లండన్ వీధుల్లో బన్నీ ఫ్యాన్స్ అదరగొట్టారు..
2040లో ఈ ప్రపంచం ఎలా ఉండనుంది? ఉపేంద్ర యూఐ టీజర్ చూశారా?
2040లో ఈ ప్రపంచం ఎలా ఉండనుంది? ఉపేంద్ర యూఐ టీజర్ చూశారా?
చాలా బాధగా ఉంది.. హీరోయిన్ ఆషికా రంగనాథ్
చాలా బాధగా ఉంది.. హీరోయిన్ ఆషికా రంగనాథ్
అశ్రద్ధ చేయకండి.. చలికాలంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్..
అశ్రద్ధ చేయకండి.. చలికాలంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్..
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!