- Telugu News Photo Gallery Cinema photos Are some of the crazed beauties concentrating more on their shoots than films these days?
Heroines Photoshoot: ఫొటో షూట్లతో ఫ్యాన్స్‌ని ఖుషి.. సినిమాలు నిల్.. ఎవరా హీరోయిన్స్.?
హీరోయిన్లంటే కంటికి ఎప్పుడూ అందంగానే కనిపించాలి. స్క్రీన్ మీదయినా.. సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ లో అయినా.. ఎంత పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా, ఫొటో షూట్లతో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని పలకరిస్తూ ఉండాల్సిందే. అలాగని జస్ట్ ఫొటో షూట్లకే పరిమితమవుతామంటే మాత్రం కుదరదు... క్రేజ్ ఉన్న కొందరు బ్యూటీలు ఈ మధ్య సినిమాలకన్నా షూట్ల మీదే ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారా?
Updated on: Dec 02, 2024 | 3:36 PM

మనందరికీ బాగా గుర్తుండిపోయిన పేరు చిట్టి. జాతిరత్నాలు సినిమాతోనూ, ఆ తర్వాత స్పెషల్ సాంగులతోనూ జనాలకు దగ్గరయ్యారు ఫరియా. ఈ అమ్మాయేంటి.. నా అంత ఎత్తుంది అని డార్లింగ్ దగ్గర ప్రశంసలు కూడా అందుకున్నారు. అంతా బాగానే ఉంది... ఫొటో షూట్లు కూడా కలర్‌ఫుల్‌గానే కనిపిస్తున్నాయి.. కానీ, ఫరియా పెద్ద స్టార్ల పక్కన ఎందుకు చేయడం లేదనే బెంగ మాత్రం ఫ్యాన్స్ లో ఉండిపోయింది.

సేమ్ టు సేమ్... ఇదే విషయం నభా విషయంలోనూ వినిపిస్తోంది. తెలుగులో సూపర్‌గా సెటిలవుతారు నభా నటేష్ అని అందరూ అనుకున్నారు ఇస్మార్ట్ శంకర్ టైమ్‌లో. కానీ, ఆ తర్వాత యాక్సిడెంట్ ఫేస్ చేయడం, కమ్‌బ్యాక్‌లో చేసిన సినిమా హిట్ కాకపోవడంతో నభాకి అవకాశాలు సన్నగిల్లాయి. అదేం లేదు... నేను యమా యాక్టివ్‌గా ఉన్నానంటూ ఆమె ప్రూవ్ చేసుకోవాలంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పలకరించాల్సిందే.

తమన్నా కూడా ఇలాంటి సిట్చువేషన్‌లోనే ఉన్నారు. సినిమాలు, స్పెషల్ సాంగులు, డిజిటల్ కంటెంట్ అంటూ ఎప్పుడూ ఏదో బిజీగానే ఉంటారు తమన్నా. కానీ, ఆమె ఎంత బిజీగా ఉన్నారనే విషయం పబ్లిక్‌లోకి వెళ్లడం లేదు. ఎంత సేపూ ఆమె చేస్తున్న ఫొటో షూట్లే హైలైట్ అవుతున్నాయి.

సినిమాల సంగతేమోగానీ, జస్ట్ ఫొటో షూట్లతోనే లైమ్ లైట్లో ఉంటున్న మరో నాయిక శ్రద్ధా దాస్. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య బొత్తిగా సినిమాల్లో కనిపించడం లేదనే కామెంట్ బాగా వినిపిస్తోంది. ఈమె సినిమాలు కోసం అభిమానులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి.

ఇంకో పదేళ్లు ఈ అమ్మాయికి ఢోకా ఉండదు అనిపించుకున్న కృతి శెట్టి కూడా మెల్లగా ఫేడవుట్ అవుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పొరుగు సినిమాల్లో నటిస్తున్నట్టే ఉన్నా.. తెలుగు వారికి మాత్రం జస్ట్ ఫొటో షూట్లతోనే హాయ్ చెబుతున్న ఫీలింగ్ కలుగుతోంది. కిసిక్ షూట్లతోనే కాదు, ఆన్ లొకేషన్ సినిమాలతోనూ బిజీగా ఉన్నప్పుడే కెరీర్ ఇంకొన్నేళ్లు.. హాయిగా సాగుతుందని సలహాలిస్తున్నారు నెటిజన్లు.




