AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha: వెండితెరపై నిషా కళ్ల సుందరి.. ఆ ఒక్క తప్పు వల్లే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యిందా.. ?

నిషా కళ్ల సుందరి.. మత్తెక్కించే కన్నులతో వెండితెరపై మాయ చేసింది. తనే ఒకప్పటి అందాల రాశి సిల్క్ స్మిత. ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు.. కానీ 80, 90'sలో సినీరంగాన్ని ఓ ఊపు ఊపేసింది. చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎదిగిన ఆమె అనుహ్యంగా జీవితాన్ని ముగించింది.

Silk Smitha: వెండితెరపై నిషా కళ్ల సుందరి.. ఆ ఒక్క తప్పు వల్లే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యిందా.. ?
Silk Smitha
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2024 | 4:37 PM

Share

నిషా కళ్లతో సినీ ప్రేక్షకులను మత్తులో తూలేలా చేసిన అందాల ముద్దుగుమ్మ సిల్క్ స్మిత. ఒకప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు జనాలు థియేటర్లలకు క్యూ కట్టేవారు. స్టార్ హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. 80, 90’s దశకంలో ఎన్నో సినిమాలో గ్లామరస్ పాత్రలు, డీ గ్లామరస్ పాత్రలు పోషించి సినీ ప్రియుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది. సిల్క్ స్మిత.. అతి తక్కువ సమయంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిన అందాల రాశి. సినీ రంగుల ప్రపంచంలో గ్లామర్ హీరోయిన్‏గా, స్పెషల్ పాటలతో సినీ ప్రియులను ఊర్రుతలూగించింది. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపిన ఆమె అనుకోని విధంగా సూసైడ్ చేసుకుని మరణించింది. అత్తింటి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయిన ఆమె.. సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత.. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించింది. ఆమె మరణంపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమెతో అనుబంధం ఉన్న సీనియర్ నటి కాకినాడ శ్యామల ఇటీవల ఓ ఇంటర్వ్యూ సిల్క్ స్మిత గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఇండస్ట్రీలో దాదాపు 200 చిత్రాల్లో నటించారు శ్యామల. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అలాగే నటిగానే కాకుండా నిర్మాతగా, ఫైనాన్షియర్ గా మంచి పేరు ఉంది.

ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ.. “చాలా సినిమాలకు నేను ఫైనాన్స్ చేశాను. అలాగే సిల్క్ స్మిత సొంత సినిమాకు కూడా ఫైనాన్స్ చేశాను. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో సిల్క్ స్మిత అప్పులపాలైంది. ఆస్తులు పోగొట్టుకుంది. కానీ ఆమె వ్యక్తత్వం చాలా గొప్పది. నిజాయితీ ఉన్న మనిషి. సినిమా సరిగ్గా ఆడలేదు కదా అని చెప్పేసి ఆమె ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదు. అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చింది. కొన్ని రోజులకు ఆమె కెరీర్ తిరిగి గాడిన పడింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందన్నా వార్త విన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.