సైలెంట్‌గా మరో మూవీ కంప్లీట్ చేసిన సిద్ధు
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరు ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. గుంటూరు టాకీస్, కల్కి సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి.

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరు ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. గుంటూరు టాకీస్, కల్కి సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి. లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో ఈ కుర్ర హీరో నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో సిద్ధులోని అన్ని కోణాలు ప్రేక్షకులతో పాటు మేకర్స్‌కు తెలిశాయి. ఆ సినిమాలో హీరోగా మెప్పించడమే కాదు.. రచయితగానూ తన టాాలెంట్ ఏంటో చూపించాడు. ఆ సినిమాలో నటనకు మంచి పేరు రావడంతో సిద్ధుకు వరుసగా మంచి మంచి చాన్సులు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో అతడిప్పుడు మూవీ చేస్తున్నాడు. అంతకంటే ముందే ‘మా వింత గాథ వినుమా’ సినిమాను సైలెంట్‌గా కంప్లీట్ చేశాడు సిద్ధు. ఆదిత్య మందాల అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణ అండ్ హిజ్ లీలలో నటించిన సీరత్ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కూడా సిద్ధు రచనా సహకారం అందించాడు. కాగా నవంబరు 13న దీపావళి కానుకగా ఈ సినిమాని ఆహా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. మరి సిద్ధు ఈసారి ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి.
Also Read :
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ