DJ Tillu Movie Review: సీను సీనుకీ సీటీ కొట్టించే డీజే టిల్లు

కొన్ని సినిమాలు ఎలా ఉంటాయో ట్రైలర్‌ చూస్తేనే అర్థమైపోతుంది. సినిమాలో ఉన్నదంతా ట్రైలర్‌లో పెట్టేశారా? లేకుంటే సినిమా కూడా ట్రైలర్‌లాగానే ఉంటుందా?

DJ Tillu Movie Review: సీను సీనుకీ సీటీ కొట్టించే డీజే టిల్లు
Dj Tillu
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajeev Rayala

Updated on: Feb 12, 2022 | 12:47 PM

కొన్ని సినిమాలు ఎలా ఉంటాయో ట్రైలర్‌ చూస్తేనే అర్థమైపోతుంది. సినిమాలో ఉన్నదంతా ట్రైలర్‌లో పెట్టేశారా? లేకుంటే సినిమా కూడా ట్రైలర్‌లాగానే ఉంటుందా? అనే విషయం కూడా కాస్త జాగ్రత్తగా గమనించిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. డీజే టిల్లు కూడా సరదా సరదాగా సాగే రొమాంటిక్‌ కామెడీ సినిమా అని ట్రైలర్‌ రిలీజ్‌ అయిన రోజే ఫిక్స్ అయ్యారు జనాలు.

సినిమా: డీజే టిల్లు

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్‌, కిరీటి దామరాజు, ప్రిన్స్, ప్రగతి తదితరులు

నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌

దర్శకత్వం: విమల్‌ కృష్ణ

రచన: విమల్‌ కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

కెమెరా: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

విడుదల: ఫిబ్రవరి 12, 2022

ఒక పర్ఫెక్ట్ పాట పాడితే జిందగీ మొత్తం టర్న్ అయిపోతుందని నమ్మే రకం డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ). హోటల్స్ లో పాటలు పాడే రాధిక (నేహా శెట్టి)తో అతనికి పరిచయమవుతుంది. రోహిత్‌ (కిరీటి దామరాజు) మర్డర్‌ కేస్‌లో అనుకోకుండా ఇరుక్కుంటాడు టిల్లు. ఇంతలోనే షాన్‌ (ప్రిన్స్) దగ్గర రెండు కోట్లు తీసుకెళ్తారు టిల్లు అండ్‌ రాధిక. మధ్యలో వీళ్లకు పరిచయమయ్యే డిటెక్టివ్‌ (నర్రా శ్రీనివాస్‌)కి కథతో సంబంధం ఏంటి? పోలీస్‌ స్టేషన్‌కి టిల్లు ఎందుకెళ్లాడు? రాధిక అతనికి సపోర్ట్ చేసిందా? లేదా? ఇలాంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

డీజే టిల్లు కేరక్టర్‌ చేయడం మాత్రమే కాదు, సినిమా మొత్తాన్ని సక్సెస్‌ఫుల్‌గా డ్రైవ్‌ చేశారు సిద్ధు జొన్నలగడ్డ. మిగిలిన కేరక్టర్లు ఎన్ని వచ్చినా, వెళ్లినా…. సిద్ధు కేరక్టర్‌ మాత్రం సినిమాను నిలబెట్టింది. ఆ ఏజ్‌ కుర్రాడు మాట్లాడినంత నేచురల్‌గా అనిపించిన డైలాగులు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. కన్‌ఫ్యూజ్డ్ ప్లస్‌ బ్యూటీఫుల్‌ లేడీగా నేహా పెర్ఫార్మెన్స్ బావుంది. పోకిరి సినిమాను గుర్తుచేసే ప్రిన్స్ రోల్‌ థియేటర్లో నవ్వులు తెప్పిస్తుంది. కోర్టు రూమ్‌ డ్రామా అనగానే మనకు సీరియస్‌గా ఉన్న సన్నివేశాలే గుర్తుకొస్తాయి. కానీ జడ్జిగా ప్రగతి చేసిన పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లో సినిమాకు పెద్ద రిలీఫ్‌. నర్రా శ్రీనివాస్‌, బ్రహ్మాజీ, ఫిష్‌ వెంకట్‌ పాత్రలు సినిమాలో సందర్భోచితంగా వచ్చి వెళ్తాయి.

ఎవర్రా నీకు ఆంటీ అంటూ బ్రహ్మాజీ మీద పడే సెటైర్లు కూడా నవ్వులు తెప్పిస్తాయి. ఏదో జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు దర్శకుడు విమల్‌ కృష్ణ. ఫస్ట్ టైమ్‌ డైరక్టర్‌ అయినప్పటికీ, రోడ్‌ జర్నీని చక్కగా విజువలైజ్‌ చేయగలిగారు. ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకోగలిగారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు తగ్గట్టుంది. సెకండ్‌ హాఫ్లో కొన్ని హాస్పిటల్స్ సీన్స్ తప్పితే విసుగు తెప్పించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. మ్యూజిక్‌, కెమెరా, ఎడిటింగ్‌ డిపార్ట్మెంటులన్నీ పర్ఫెక్ట్ సింక్‌తో పనిచేశాయనిపిస్తుంది. పెద్దగా ట్విస్టులు, టర్న్ లు, ఎమోషన్స్ వంటివి ఎక్స్ పెక్ట్ చేయకుండా, మనతోని ముచ్చట అట్టుంటది, నాది అసలే డెలికేట్‌ మైండ్‌…తరహా సరదా సరదా మాటలకు నవ్వుకోవాలనుకునేవారికి పర్ఫెక్ట్ సినిమా డీజే టిల్లు

డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బాబు కోసం పోటీపడుతున్న ముద్దుగుమ్మలు.. త్రివిక్రమ్ సినిమాలో..

సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

RGV: జగన్ సూపర్ డూపర్ ఒమేగా స్టార్.. కానీ మన హీరోలు మాత్రం.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..