Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameera Reddy: స్లిమ్‌గా మారిపోయిన సమీర.. బరువు తగ్గేందుకు ఏం టిప్స్‌ చెప్పిందంటే..

Weight Loss Tips: సమీరా రెడ్డి (Sameera Reddy)...ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రకారుని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

Sameera Reddy: స్లిమ్‌గా మారిపోయిన సమీర.. బరువు తగ్గేందుకు ఏం టిప్స్‌ చెప్పిందంటే..
Sameera Reddy
Follow us
Basha Shek

|

Updated on: Feb 12, 2022 | 12:43 PM

Weight Loss Tips: సమీరా రెడ్డి (Sameera Reddy)…ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రకారుని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నరసింహుడు, జైచిరంజీవ, అశోక్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. కొన్నేళ్ల క్రితం ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాలో వెంకీ, రానాతో కలిసి స్టెప్పులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియా (Social Media) ద్వారా నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. హెల్త్‌, ఫిట్‌నెస్‌, బ్రెస్ట్‌మిల్క్‌, ప్రెగ్నెన్సీ కేర్‌ టిప్స్‌ ను పంచుకుంటూ మహిళల్లో అవగాహన కల్పిస్తుంటుంది. ఇక అమ్మగా ప్రమోషన్‌ పొందిన తర్వాత బొద్దుగుమ్మగా మారిపోయిన సమీర.. గతేడాది నుంచి మళ్లీ బరువు తగ్గే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంది. వ్యాయామాలు, వర్కవుట్లను తన జీవనశైలిలో భాగం చేసుకుంది. ఈక్రమంలో గతేడాది 92 కిలోల బరువున్న సమీర ఇప్పుడు 81 కిలోలకు చేరుకుంది.

ప్రతికూల ఆలోచనలను రానీయలేదు..

కాగా ఎప్పటికప్పుడు తన వెయిట్‌ లాస్‌ టిప్స్‌ (Weight Loss Tips)ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటోన్న ఈ అందాల తార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో బొద్దుగా ఉన్నప్పుడు, ఇప్పటి ఫొటోలను కొలేజ్‌ చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టింది. ‘ఏడాది క్రితం నా బరువు 92 కిలోలకు చేరుకుంది. దీంతో ఫిట్‌నెస్‌పై సీరియస్‌ గా దృష్టి సారించాను. ఇప్పుడు నా బరువు 81 కిలోలు. బరువు తగ్గడం వల్ల నా ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. ఏకాగ్రత బాగా పెరిగింది. బరువు తగ్గడంలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ ఎంతో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా క్రమం తప్పకుండా వర్కవుట్లు, వ్యాయామాలు చేశాను. ప్రతికూల ఆలోచనలను దగ్గరకు రానీయలేదు. సానుకూల దృక్పథం అలవర్చుకున్నాను. ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా శరీరంతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. గేమ్స్‌ ఆడడం వల్ల ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి మీరు కూడా వీటిని భాగం చేసుకోండి. ఇక చివరిగా చెప్పే విషయమేంటంటే.. ఎప్పుడూ మీపై మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. త్వరగా బరువు తగ్గాలని ప్రయత్నించకండి’ అని తన వెయిట్‌ లాస్‌ టిప్స్‌ గురించి చెప్పుకొచ్చింది సమీరా.

Also Read:Mahesh Babu: మహేష్ బాబు కోసం పోటీపడుతున్న ముద్దుగుమ్మలు.. త్రివిక్రమ్ సినిమాలో..

Bonda Uma: ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్ మీకే.. టీడీపీ లీడర్ బోండా ఉమ ఎద్దేవా

Kagiso Rabada IPL 2022 Auction: రబాడా కోసం తగ్గేదేలే అన్న పంజాబ్ కింగ్స్.. ఎంతకు అమ్ముడయ్యాడంటే?