AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు కోసం పోటీపడుతున్న ముద్దుగుమ్మలు.. త్రివిక్రమ్ సినిమాలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Mahesh Babu: మహేష్ బాబు కోసం పోటీపడుతున్న ముద్దుగుమ్మలు.. త్రివిక్రమ్ సినిమాలో..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2022 | 12:38 PM

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ కళావతి పాటను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా విడుదలైన ఈ పాట ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో పూజాహెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేశారు త్రివిక్రమ్.

ఇక సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ , మలయాళీ బైట్ సంయుక్త మీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పడు మరో ఇద్దరు భామల పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఖిలాడి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు ముద్దుగుమ్మలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి. ఇప్పుడు ఈ ఇద్దరు భామల్లో ఒకరు మహేష్ సినిమాలో నటించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఖిలాడి సినిమాలో ఈ ఇద్దరు భామలు పోటీపడి నటించి ఆకట్టుకున్నారు. గ్లామర్ పరంగానూ ఇద్దరు అదరగొట్టారు. దర్శకుడు త్రివిక్రమ్ రెండు మూడు రోజుల్లో ఇద్దరిని ఆఫీస్ కి పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కానీ నిజమైతే ఈ బ్యూటీస్ కు బంపర్ ఆఫర్ దక్కినట్టే.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :

DJ Tillu Twitter Review: దుమ్మురేపుతున్న డీజే టిల్లు.. ట్విట్టర్‌లో రీసౌండ్

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు