Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonda Uma: ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్ మీకే.. టీడీపీ లీడర్ బోండా ఉమ ఎద్దేవా

అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినందుకు ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని టీడీపీ నేత బోండా ఉమా(TDP Leader Bonda Uma) ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం విశాఖలో..

Bonda Uma: ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్ మీకే.. టీడీపీ లీడర్ బోండా ఉమ ఎద్దేవా
Bonda Uma
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 12, 2022 | 12:15 PM

అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినందుకు ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని టీడీపీ నేత బోండా ఉమా(TDP Leader Bonda Uma) ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం విశాఖలో అదానీ కి వేలకోట్లు ఆస్తులు ముట్టజెప్పారని ఆరోపించారు. జీవో 225 ద్వారా 75 గజాలు పైగా ఉన్న ఇళ్ల స్థలాల్లో రూ. లక్షలు వసూలు చేస్తున్నారని, లేకపోతే ఇళ్లను జప్తు చేస్తామని నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పార్టీపై విష ప్రచారం చేయడమే లక్ష్యంగా మంత్రి కొడాలి నాని వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

”వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లాల విభజన విషయంలో రాష్ట్రం భగ్గుమంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు” అని ఉమా ప్రశ్నించారు.

మరో వైపు జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై స్థానికులు నిరసనలు చేపట్టారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా కాకుండా రాయచోటిలో కలపడంపై స్థానికులు ఆందోళనలకు దిగారు. అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలులో కాకుండా బాపట్లలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. హిందూపురం ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read

Viral video: మహిళ పైకి కారు ఎక్కించి ఆపై.. వీడియో చూస్తే షాక్..

IPL 2022 auction: IPLలో కాసుల వర్షం.. ప్రపంచంలోని మిగిలిన లీగ్‌ల కంటే గరిష్టంగా ఎవరికి దక్కుతుందో తెలుసా..

అతడు సెంచరీ చేసిన ప్రతిసారి భారత్‌ గెలిచేది.. ఆ మణికట్టు మాయాజాలం అద్భుతం..