Bandi Sanjay: ఢిల్లీ కోటలు బద్దలు కొట్టే ముందు రాష్ట్రం సంగతి చూస్కో.. సీఎం కేసీఆర్‌‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కౌంటర్

Bandi Sanjay: ఢిల్లీ కోటలు బద్దలు కొట్టే ముందు రాష్ట్రం సంగతి చూస్కో.. సీఎం కేసీఆర్‌‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కౌంటర్
Bandi Sanjay

జనగాం సభలో కేసీఆర్‌ మాటల తూటాలకు రాష్ట్ర బీజేపీ నేతల కౌంటర్లతో.. తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా డైలాగ్‌ వార్‌ మొదలైంది. జి

Balaraju Goud

|

Feb 12, 2022 | 12:13 PM

Bandi Sanjay Fires on CM KCR: జనగాం సభలో కేసీఆర్‌ మాటల తూటాలకు రాష్ట్ర బీజేపీ నేతల కౌంటర్లతో.. తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా డైలాగ్‌ వార్‌ మొదలైంది. జిల్లాల పర్యటనలో భాగంగా జరిగిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైరయ్యారు.. యూపీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తానన్న కేసీఆర్‌ను.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌‌.. ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. ఎందుకోసం బహిరంగ సభలు పెడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. రాజ్యాంగంపై క్షమాపణలు చెబుతారని అనుకున్నానని.. కానీ ఆయనలో ఇంకా మార్పు రాలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్‌.

సీఎం ప్రసంగం వినలేకపోయాను… కానీ ప్రజలు చాలా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోందన్నారు బండి సంజయ్.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అని చెప్పడానికే కేసీఆర్ జనగామ బహిరంగ సభ పెట్టారని బండి సంజయ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ బీజేపీ.. టిఆర్ఎస్ చిన్న పార్టీ అన్నారు. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడారు… ఆయన పై విచారణ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను రెచ్చకొట్టడానికి సెంటిమెంటును రగల్చడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

కేంద్రం ధాన్యం కొనగోలు చేయమని ఎక్కడ చెప్పలేదన్న బండి సంజయ్.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడైనా లేఖ ఇచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. డిస్కంలకు 48 వేల కోట్ల రూపాయల అప్పులు బాకీ ఉన్నారని ఆయన గుర్తు చేశారు. హుజురాబాద్ లో ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో… జాబితా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. త్వరలోనే జనగామ లోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ తెలిపారు. 317 జీవో సవరించాలని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.. అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu