Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే స్టాఫ్ నర్స్, డాక్టర్ పోస్టుల భర్తీ..

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao)  గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే వివిధ ఆస్పత్రుల్లో స్టాఫ్‌ నర్స్‌, డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి  ప్రకటించారు.

Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే స్టాఫ్ నర్స్, డాక్టర్ పోస్టుల భర్తీ..
Follow us
Basha Shek

|

Updated on: Feb 12, 2022 | 12:10 PM

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao)  గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే వివిధ ఆస్పత్రుల్లో స్టాఫ్‌ నర్స్‌, డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి  ప్రకటించారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో రూ.రూ. 10.91 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఓపీడీ బ్లాక్‌కు హరీశ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం13 హార్సే వెహికల్స్ (పార్థీవ దేహాలను తరలించే వాహనాలు), 3 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రజా వైద్యంలో రూ. 1690 తలసరి ఖర్చు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు.

మార్చురీలను అభివృద్ధి చేస్తున్నాం!

‘ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికే తెలంగాణాలో 50 పార్థివ దేహాలు తరలించే వాహనాలు ఉన్నాయి. ఇప్పడు మరో 13 ప్రారంభించాం. రూ. 32 కోట్ల తో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో మార్చురీలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఉస్మానియాలోని మార్చురీని రూ. 9 కోట్ల నిధులతో ఆధునిక వసతులు ఏర్పాటుచేస్తున్నాం. వైద్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్‌ నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. త్వరలోనే గడ్డి అన్నారం హాస్పిటల్‌, చెస్ట్ ఆస్పత్రుల్లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించ పోతున్నాం’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

Also Read:Viral: బోరు కొట్టిందని పెయింటింగ్ స్కిల్స్ చూపించిన సెక్యూరిటీ గార్డు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్.!

AP Special Status: కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా.. ఈ నెల 17న చర్చలకు రావాలని ఏపీకి ఆహ్వానం

Visakhapatnam: అమెరికాలో విశాఖ యువకుడి దారుణ హత్య.. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు..