TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
TsCab Jobs

TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులను...

Narender Vaitla

|

Feb 12, 2022 | 4:06 PM

TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏఐఐబీ/ డిప్లొమా (కోఆపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)/సీఏ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవంతోపాటు తెలుగు భాషలో మంచి నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35-62 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జనరల్‌ మేనేజర్‌ (హెచ్ఆర్‌డీ), తెలంగాణ స్టేట్‌ కొపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌, ట్రూప్‌ బజార్‌, హైదరాబాద్‌, 500001 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000లతో పాటు అలవెన్సులు కూడా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 25-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Pomegranate: దానిమ్మ సాగుతో అధిక లాభాలు.. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ..

Devdutt Padikkal IPL 2022 Auction: బెంగుళూరు ఓపెనర్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌.. ఎంత పలికాడంటే..?

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు.. మరిన్ని వివరాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu