Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devdutt Padikkal IPL 2022 Auction: బెంగుళూరు ఓపెనర్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌.. ఎంత పలికాడంటే..?

Devdutt Padikkal Auction Price: దేవదత్ పడిక్కల్‌ ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధర పలికాడు.

Devdutt Padikkal IPL 2022 Auction: బెంగుళూరు ఓపెనర్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌.. ఎంత పలికాడంటే..?
Devdutt Padikkal
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 12, 2022 | 2:24 PM

Devdutt Padikkal Auction Price: ఐపిఎల్ 2022 వేలంలో దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. దేవదత్ పడిక్కల్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అంతకుముందు అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. కానీ అతన్ని ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. IPL 2019 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దేవదత్ పడిక్కల్‌ను రూ. 20 లక్షలకు దక్కించుకుంది.

ఐపిఎల్ 2020 సీజన్‌లో ఆర్‌సిబి దేవదత్ పడిక్కల్‌ను ఓపెనర్‌గా పరిచయం చేసింది. అతను టోర్నమెంట్‌లో 5 అర్ధ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. మొత్తంగా, అతను 15 మ్యాచ్‌లో 31.53 సగటుతో 473 పరుగులు చేశాడు. అతను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. పడిక్కల్ బ్యాటింగ్ ప్రదర్శన 2021 సీజన్‌లో ఆకట్టుకోలేకపోయినప్పటికీ భారీ ధర పలికాడు. పడిక్కల్ IPL 2021లో 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, అర్ధ సెంచరీతో 411 పరుగులు చేశాడు.

Read Also.. RCB IPL 2022 Auction: కోహ్లీ టీంలో చేరిన హర్షల్ పటేల్.. అత్యధిక ధర చెల్లించిన ఆర్‌సీబీ..