Manish Pandey IPL 2022 Auction: హైదరాబాద్‌కు షాకిచ్చిన లక్నో.. మనీష్ పాండేను ఎంతకు దక్కించుకుందంటే?
Manish Pandey Auction Price: మనీష్ పాండే కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే, ఇందులో..
Manish Pandey Auction Price: ఐపీఎల్ 2022 సీజన్ ప్లేయర్ ఆక్షన్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 4.60 కోట్లకు దక్కించుకుంది. వేలంలో(IPL 2022 Auction) భారీ ధర పలికే అవకాశం ఉన్నా.. ఈ ఆటగాడిపై లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే అత్యధిక ధరకు తీసుకుంటారనుకుంటే, చివర్లో హైదరాబాద్ వెనక్కు తగ్గడంతో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 4.60 కోట్లకు దక్కించుకుంది. టీమిండియాలోనూ అనుభవం ఉన్న ఈ బ్యాట్స్‌మన్‌ను దక్కించుకోవడంలో హైదరాబాద్ విఫలమైంది. కెప్టెన్సీతోపాటు, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా ముందుకుసాగే ఈ ప్లేయర్.. ఇండియన్ మిడిలార్డర్‌లోనూ ఆకట్టుకున్నాడు. అంతకుముందు సీజన్లలో ఈ కర్ణాటక ప్లేయర్ మనీష్ పాండే పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు. అయితే, లీగ్ చరిత్రలోనే శతకం చేసిన మొదటి భారత బ్యాట్స్‌మన్‌గా మనీష్ పాండే(Manish Pandey) కీర్తి ఘడించాడు.
Also Read: IPL 2022 Auction: వార్నర్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎంతకు అమ్ముడుపోయాడో తెలుసా.?
Quinton de Kock IPL 2022 Auction: లక్నో సొంతమైన డికాక్.. ఎంత ధర చెల్లించిందంటే?