Viral: బోరు కొట్టిందని పెయింటింగ్ స్కిల్స్ చూపించిన సెక్యూరిటీ గార్డు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్.!
మనకు తెలియని పనిలో వేలు పెడితే మొదటికే మోసం వస్తుందంటారు పెద్దలు. సరిగ్గా ఈ సామెతకు అడ్డంపట్టే విధంగా ఓ సంఘటన జరిగింది...
మనకు తెలియని పనిలో వేలు పెడితే మొదటికే మోసం వస్తుందంటారు పెద్దలు. సరిగ్గా ఈ సామెతకు అడ్డంపట్టే విధంగా ఓ సంఘటన జరిగింది. ఓ సెక్యూరిటీ గార్డు బోరు కొట్టి చేసిన పని చివరికి ఊహించనటువంటి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. 1932-1934 కాలంలో ప్రసిద్ది చెందిన ‘త్రీ ఫిగర్స్’ పెయింటింగ్‌ను గతేడాది డిసెంబర్ 7వ తేదీన రష్యాలోని ‘ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్’ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇక ఆ ఎగ్జిబిషన్‌కు ఓ ప్రైవేటు సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. అందులోని ఒకడు బోరు కొట్టి ఏం చేయాలో తెలియక ఈ పెయింటింగ్‌పై పెన్‌తో కళ్లు గీశాడు. తెలిసీ తెలియక ఆటగాడు చేసిన ఈ పనికి ఏకంగా రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీనితో సదరు ప్రైవేటు సంస్థ ఆ సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించింది. ఆ పెయింటింగ్‌కు సుమారు రూ. 7.47 కోట్లతో బీమా ఉండగా.. సెక్యూరిటీ గార్డు చేసిన పనికి ఆ పెయింటింగ్‌కు పునరుద్దరణ చేసేందుకు ప్రైవేటు కంపెనీ బోలెడంత డబ్బు వెచ్చిందని సమాచారం. అంతేకాదు దానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు నిపుణులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారట.