Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మహిళ పైకి కారు ఎక్కించి ఆపై.. వీడియో చూస్తే షాక్..

నిత్యం మనం ఎన్నోరకాల రోడ్డు ప్రమాదాలను చూస్తూ ఉంటాం.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న అవతలి వారి నిర్లక్ష్యం మన ప్రాణాలమీదకు వస్తుంది..

Viral video: మహిళ పైకి కారు ఎక్కించి ఆపై.. వీడియో చూస్తే షాక్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2022 | 12:06 PM

Viral video: నిత్యం మనం ఎన్నోరకాల రోడ్డు ప్రమాదాలను చూస్తూ ఉంటాం.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న అవతలి వారి నిర్లక్ష్యం మన ప్రాణాలమీదకు వస్తుంది.. రోడ్ల మీద ఎదవలకు కొదవే ఉండదు అంటుంటారు కొందరు.. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదాలు పై ఎప్పటికప్పుడు అవగాహన కలిపిస్తూనే ఉంటారు.. అయితే కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. వాహనాలను రివర్స్ చేసే సమయంలో అనుకోకుండా వెనకాల ఉన్న వ్యక్తులను ఢీ కొట్టడం మనం చూశాం.. ఈ వీడియో లో కూడా అదే జరిగింది. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ టాటర్‌స్థాన్‌లోని జెలెనోడోల్స్క్ నగరంలో జరిగింది ఈ ఘటన.. ఒక మహిళను ఏకంగా రెండు సార్లు కారుతో ఢీకొట్టాడు ఓ ఘనుడు.

శీతాకాలం కావడంతో జెలెనోడోల్స్క్ నగరంలో మంచు భారీగా కురుస్తుంది. అయితే 77 ఏళ్ల మహిళ మంచుతో కప్పబడిన పార్కింగ్ ప్రదేశంలో కారు వెనుక నిలబడి ఉంది. అకస్మాత్తుగా పార్క్ చేసిన కారు రివర్స్ అవుతూ ఆమెను ఢీకొట్టింది. అంతే కాదు కారు వెనుక చక్రం ఆమె మీదకు ఎక్కేసింది. ఆ తర్వాత కారును ముందు తీశాడు ఆ డ్రైవర్.. కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడే కూర్చొని ఉండిపోయింది. కానీ ఇక్కడే ఊహించని సంఘటన జరిగింది. ముందుకు వెళ్లిన ఆ కారు మళ్లీ రివర్స్ లో వచ్చి ఆమెను తిరిగి ఢీకొట్టింది. మళ్లీ కారు వెనక టైరు ఆమె పైకి పూర్తిగా ఎక్కించాడు ఆ డ్రైవర్.. వెనుక ఏం జరుగుతుందో సోయి లేకుండా కారు నడిపిన ఆ డ్రైవర్ చివరకు కారు దిగి ఆమెను పైకి లేపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. ఆ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 22 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నాడని, అయితే గత రెండేళ్లలో వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఐదుసార్లు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ యాక్సిడెంట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

DJ Tillu Twitter Review: దుమ్మురేపుతున్న డీజే టిల్లు.. ట్విట్టర్‌లో రీసౌండ్

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..