Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: రెండుగా విడిపోయినా.. ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి.. మంత్రి కేటీఆర్ ట్వీట్

ఏపీ మంత్రులు, నేతల నుంచి లభిస్తున్న సోదర ప్రేమకు ఎంతో పొంగిపోయానని తెలంగాణ(Telangana) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు భౌగోళికంగా విడిపోయినా..

KTR: రెండుగా విడిపోయినా.. ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి.. మంత్రి కేటీఆర్ ట్వీట్
Health profile in Telangana
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 12, 2022 | 11:11 AM

ఏపీ మంత్రులు, నేతల నుంచి లభిస్తున్న సోదర ప్రేమకు ఎంతో పొంగిపోయానని తెలంగాణ(Telangana) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు భౌగోళికంగా విడిపోయినా.. మన మధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని వెల్లడించారు. “నిన్న ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వెళ్లాను. వారి నుంచి లభించిన ప్రేమాభిమానాలు చూసి పొంగిపోయాను.” అని ట్విట్టర్(Twitter) వేదికగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ కుమారుడు సందీప్ వివాహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ వేడుక‌లో మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులు శ్రీధ‌ర్ బాబు, సుద‌ర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నూత‌న వ‌ధూవ‌రులను ఆశీర్వదించారు.

Also Read

Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!

Allu Arjun at Statue of Equality: సమతామూర్తి సన్నిధిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. ప్రత్యేక పూజలో పాల్గొన్న బన్నీ ఫొటోస్..

Supreme on Hijab: దేశంలో హిజాబ్ ప్రకంపనలు.. అత్యవసర పిటిషన్‌కు సుప్రీం నో.. వివాదంపై చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు