Viral Video: ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి.. లైక్స్ కోసం చిన్నపిల్ల ప్రాణాలతో ఆటలా అంటూ నెటిజన్ల ఆగ్రహం..(వీడియో)
మనం ఆవు, పాలు, మేక పాలు, చివరికి గాడిద పాలు తాగేవారిని కూడా చూశాం. కానీ, ఈ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. పైగా.. ఏనుగు కిందకు దూరి.. దాని పొదుగును నొక్కుతూ మరీ పాలు తాగేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.
మనం ఆవు, పాలు, మేక పాలు, చివరికి గాడిద పాలు తాగేవారిని కూడా చూశాం. కానీ, ఈ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. పైగా.. ఏనుగు కిందకు దూరి.. దాని పొదుగును నొక్కుతూ మరీ పాలు తాగేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. గోలాఘాట్ జిల్లాకు చెందిన హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఏనుగు వద్ద ఆడుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఏనుగు పొదుగును నొక్కుతూ పాలు తాగింది. ఆ ఏనుగును ‘‘బిను బిను’’ అంటూ ముద్దుగా పిలుస్తూ దాని దగ్గరే ఆటలు ఆడుతోంది. ఆ చిన్నారి పాలు పిండి తాగుతున్నా.. ఏనుగు అలా చూస్తేనే ఉంది కానీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఇదంతా చూస్తుంటే ఆ చిన్నారి మావటి కుటుంబానికి చెందినదిగా తెలుస్తోంది. ఆ సమయంలో పెద్దలు కూడా ఏనుగుకు సమీపంలోనే ఉన్నారు. ఏనుగులు ఒక్కోసారి చాలా ఆగ్రహంతో ఉంటాయి. తొండంతో పట్టుకుని విసిరేయడమే కాదు.. కాళ్లతో తొక్కి చంపేస్తాయి కూడా. ఇదే అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా.. ‘‘లక్కీగా ఆ ఏనుగు చిన్నారిని ఏమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. దానికి చిరాకు వస్తే చిన్నారి ప్రాణాలకు హాని కలిగేది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

