AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: అమెరికాలో విశాఖ యువకుడి దారుణ హత్య.. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు..

ఉన్నత చదువులు అభ్యసించి, మంచి ఉద్యోగం తెచ్చుకుందామన్న కలలతో నెల రోజుల క్రితమే అమెరికా (America) వెళ్లాడు ఆ యువకుడు. గర్భంతో ఉన్న భార్య, తల్లిదండ్రులను వదిలేసి మరి యూఎస్‌ ఫ్లైట్‌ ఎక్కాడు.

Visakhapatnam: అమెరికాలో విశాఖ యువకుడి దారుణ హత్య.. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు..
Basha Shek
|

Updated on: Feb 12, 2022 | 11:45 AM

Share

ఉన్నత చదువులు అభ్యసించి, మంచి ఉద్యోగం తెచ్చుకుందామన్న కలలతో నెల రోజుల క్రితమే అమెరికా (America) వెళ్లాడు ఆ యువకుడు. గర్భంతో ఉన్న భార్య, తల్లిదండ్రులను వదిలేసి మరి యూఎస్‌ ఫ్లైట్‌ ఎక్కాడు. చదువుతో పాటు ఉపాధి కోసం ఓ చోట పనికి చేరాడు. అంతా బాగుందనుకున్న సమయంలో కొందరు దోపిడీ దొంగలు అతని పాలిట యమకింకరులయ్యారు. డబ్బుకోసం తుపాకీతో కాల్చి చంపారు. ఇది అమెరికాలో గురువారం (ఫిబ్రవరి 10) దోపిడీ దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన 27 ఏళ్ల సత్యకృష్ణ చిట్టూరి నేపథ్యం.

నెల రోజుల క్రితమే అమెరికాకు..

విశాఖపట్నంకు చెందిన చిట్టూరి సత్యకృష్ణ చిట్టూరికి కొన్ని నెలల క్రితమే వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భంతో ఉంది. త్వరలోనే పండంటి బిడ్డకు స్వాగతం పలుకుదామన్న ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. నెల రోజుల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సత్యకృష్ణ ఉపాధి కోసం ఓ దుకాణంలో స్టోర్‌ క్లర్క్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం గుర్తు తెలియని దోపిడీ దొంగలు డబ్బు కోసం అతనిపై కాల్పులు జరిపారు. దీంతో సంఘటనా స్థలంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విశాఖలోని అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. సత్యకృష్ణ మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అతని కుటుంబీకులు, బంధువులు కోరుతున్నారు.

Also Read:సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

Viral Video: ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి.. లైక్స్ కోసం చిన్నపిల్ల ప్రాణాలతో ఆటలా అంటూ నెటిజన్ల ఆగ్రహం..(వీడియో)

IPL 2022 Auction: మొదలైన క్రికెట్ అభిమానుల పండగ.. తొలిరోజు వేలంలో ఎంతమంది ప్లేయర్లంటే?

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా