IPL 2022 Auction: మొదలైన క్రికెట్ అభిమానుల పండగ.. తొలిరోజు వేలంలో ఎంతమంది ప్లేయర్లంటే?

ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత రిచ్ లీగ్ ఐపీఎల్ వేలానికి అన్ని జట్లతో పాటు ఆటగాళ్లు రెడీ అయ్యారు. ఎవరి జట్టులో ఏ ఆటగాడు చేరనున్నాడు, ఏ ఆటగాడికి ఎంత డబ్బు దక్కనుందో..

IPL 2022 Auction: మొదలైన క్రికెట్ అభిమానుల పండగ.. తొలిరోజు వేలంలో ఎంతమంది ప్లేయర్లంటే?
Ipl 2022 Mega Auction
Follow us

|

Updated on: Feb 12, 2022 | 11:04 AM

ఐపీఎల్ మెగా వేలానికి(IPL 2022 Auction) రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత రిచ్ లీగ్ ఐపీఎల్ వేలానికి అన్ని జట్లతో పాటు ఆటగాళ్లు రెడీ అయ్యారు. ఎవరి జట్టులో ఏ ఆటగాడు చేరనున్నాడు, ఏ ఆటగాడికి ఎంత డబ్బు దక్కనుంది, ఎవరిని లక్ వరించనుందో మరికొద్ది సేపట్లో తేలనుంది. నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరగనున్న ఈ మెగా వేలానికి బెంగళూరు రెడీ అయ్యింది. అసలు మొదటి రోజు ఎంతమంది వేలంలోకి రానున్నారు. రెండో రోజు వేలంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వేలం ఎక్కడ: బెంగళూరు

ఎప్పుడెప్పుడు: ఫిబ్రవరి 12, 13

మొత్తం జట్లు: ఐపీఎల్ 8 టీమ్‌లతో పాటు కొత్తగా చేరిన లక్నో సూపర్‌ జెయింట్స్, గుజరాత్‌ టైటాన్స్‌‌తో మొత్తం 10 టీంలు వేలానికి సిద్ధమయ్యాయి.

జట్లు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య: 33 మంది

వేలంలో ఇంకెంతమంది ఉన్నారు: 60 మంది (377 మంది ఇండియన్ ప్లేయర్లు, 223 మంది విదేశీ ఆటగాళ్లు)

వేలంలో ఎంతమందిని ఎంచుకోనున్నారు: 227 మందిని గరిష్టంగా ఎంచుకోనున్నారు.

ఒక్కో టీమ్‌ కనిష్టంగా 18, గరిష్టంగా 25 మందిని ఎంచుకోనున్నారు. (ఇందులో 8 మంది విదేశీయులు ఉండాలి)

ఒక్కో జట్టు ఎంత ఖర్చు చేయాలి: గరిష్టంగా ప్రతీ జట్టుకు రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసే అనుమతి ఉంది. ప్లేయర్లను ఎంచుకునేందుకు కనిష్టంగా రూ. 67.5 కోట్లయినా ఉపయోగించాల్సి ఉంటుంది.

మొదటి రోజు, ఫిబ్రవరి 12న: ఈ రోజు (శనివారం) వేలంలో మొత్తం 161 మంది క్రికెటర్లను మాత్రమే వేలం వేయనున్నారు. మిగిలిన 439 మంది ఆటగాళ్లను ఆదివారం వేలం వేయనున్నారు. అయితే మొదటి రోజు అనంతరం 10 ఫ్రాంచైజీలు ఎంతమందిని ఎంచుకున్నారో ఓ క్లారిటీ వస్తుంది. దీని తరువాత రెండో రోజు మొత్తం 439 మంది ప్లేయర్లలో ఎంతమంది వేలంలోకి వస్తే బాగుంటుందో అన్ని జట్లు నిర్ణయించుకుని బీసీసీఐకి విన్నవించనున్నారు. దాంతో ఫ్రాంచైజీల కోరికమేరకు వారిని మాత్రమే వేలంలో ఉంచనున్నారు.

Also Read: IPL 2022 Auction: జట్ల నుంచి ఆటగాళ్ల వరకు.. మెగా వేలానికి సంబంధించి 10 కీలక విషయాలు..

IPL 2022 Auction, Day 1, Live: తగ్గేదేలే.! 10 జట్లు.. రూ. 561 కోట్లు.. 590 మంది క్రికెటర్లు..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..