క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. ప్రపంచంలోనే రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం (IPL 2022 Auction) నేడు, రేపు బెంగళూరులో జరగనుంది. ఆటగాళ్ళ వేలానికి అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఏ ఆటగాడు ఏ జట్టును పొందుతాడు. ఎవరి జేబు ఎంత ఖాళీ కానుందో నేడు జరగనున్న మెగా వేలం అన్నింటిని నిర్ణయించనుంది. ఈ వేలం రౌండ్ రెండు రోజుల పాటు కనసాగుతుంది. అంటే రాబోయే 48 గంటలు ఆటగాళ్లకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు కూడా చాలా ముఖ్యమైనది. అందువల్ల, ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే మెగా వేలం గురించి ముఖ్యమైన 10 విషయాలను తెలుసుకుందాం.
- IPL 2022 మెగా వేలం బెంగళూరులో నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది దక్షిణ భారత నగరంలోని హోటల్ ఐటీసీ గార్డెనియాలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆటగాళ్ల వేలం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 13న ఈవెంట్ తుది ముగింపునకు చేరుకుంటుంది.
- IPL చరిత్రలో తొలిసారిగా, 10 ఫ్రాంచైజీలు మెగా వేలంలో భాగంగా కనిపించనున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్ రెండు కొత్త జట్లు పాల్గొంటున్నాయి.
- IPL 2022 మెగా వేలం కోసం మొత్తం 590 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు దానికి మరో 10 మంది ఆటగాళ్లు చేరారు. ఈ ఆటగాళ్లందరూ అన్‌క్యాప్‌లో ఉన్నారు. వీరిలో ముగ్గురు ఆస్ట్రేలియా, ఏడుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు.
- వేలానికి ముందు భారత ఆటగాడు దీపక్ హుడా బేస్ ధర రూ.35 లక్షలు పెరిగింది. గతంలో అతని బేస్ ధర రూ.40 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.75 లక్షలుగా మారింది. అతను వేలంలో తన పేరును ఉంచినప్పుడు, అతను అన్‌క్యాప్డ్ ఆటగాడు కావడం వల్ల ఇది సాధ్యమైంది. ప్రస్తుతం భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడంతో అతని బేస్ ప్రైస్‌లో మార్పులు వచ్చాయి.
- IPL 2022 వేలంలో పాల్గొనే 10 జట్లలో, పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ కలిగి ఉంది. అతని వద్ద రూ.72 కోట్లు ఉన్నాయి. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అత్యల్పంగా రూ.47.5 కోట్లు ఉన్నాయి.
- రెండు కొత్త IPL జట్లు అంటే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్‌ల పర్స్‌లో వారి జట్టును నిర్మించడానికి రూ. రూ. 52 కోట్లు, రూ. 59 కోట్లు మిగిలి ఉన్నాయి.
- IPL 2022 మెగా వేలానికి ముందు, ప్రతి జట్టు 3 నుంచి 4 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసింది.
- IPL 2022 అన్ని జట్లు కనీసం 18, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈసారి IPL 2022 మెగా వేలంలో, ఏ ఫ్రాంచైజీ కూడా రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించలేరు.
- IPL 2022 మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అనేది కొద్ది గంటల్లో తేలనుంది. కానీ, రూ.17 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్‌కు కెప్టెన్‌గా మారడం ద్వారా, కేఎల్ రాహుల్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.