Telangana Crime News: తెలిసిన వాడే కదా అని లిఫ్ట్ ఇస్తే.. ఏం చేశాడో తెలిస్తే షాకే..
తెలిసిన వాడే కదా అని లిఫ్ట్ ఇస్తే.. కత్తితో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామానికి..
తెలిసిన వాడే కదా అని లిఫ్ట్ ఇస్తే.. కత్తితో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామానికి చెందిన రైతు దాసరి కొమురయ్యపై అదే గ్రామానికి చెందిన కృష్ణసాయి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలం పనులు ముగించుకొని కొమురయ్య ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో కృష్ణసాయి లిఫ్టు అడగడంతో ఎక్కించుకున్నాడు.
వాహనం వెనక సీటులో కూర్చున్న కృష్ణసాయి కత్తితో కొమురయ్యపై దాడికి పాల్పడ్డాడు. వీపుపై కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు బాధితుడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే నిందితుడు దాడికి పాల్పడినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామన్నారు.
Also Read
Viral video: మహిళ పైకి కారు ఎక్కించి ఆపై.. వీడియో చూస్తే షాక్..
Tenali Murder: కుటుంబం పరువు తీస్తున్నాడని.. మెడకు కండువా చుట్టి.. అత్యంత పాశవికంగా..