Tenali Murder: కుటుంబం పరువు తీస్తున్నాడని.. మెడకు కండువా చుట్టి.. అత్యంత పాశవికంగా..
సమాజంలో రోజురోజుకు మానవ విలువలు దిగజారిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే సొంత వారిని చంపుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో అల్లుడిని మామ దారుణంగా..
సమాజంలో రోజురోజుకు మానవ విలువలు దిగజారిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే సొంత వారిని చంపుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో అల్లుడిని మామ దారుణంగా హత్య(Murder) చేశాడు. తన కుటుంబం పరువు తీసేలా వ్యవహరిస్తున్నాడని కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. గుంటూరు(Guntur) జిల్లా తెనాలి మల్లెపాడుకు చెందిన పులివర్తి రవి.. తన కుమార్తెను వేమూరు మండలంలోని చావలికి చెందిన సుబ్బయ్యతో 2011 లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కొంతకాలం తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2018లో తెనాలి(Tenali) మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు, ఆపై తెనాలి న్యాయస్థానంలో కుటుంబ నిర్వహణ కేసు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఆమె పిల్లలతో కలిసి పుట్టింటిలోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో సుబ్బయ్య తన భార్య, బావమరుదులు, వారి ఇతర కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగిస్తూ పలువురితో మాట్లాడడం, వారి కాపురాలు దెబ్బతినేలా యుక్తులు పన్నడంతో అతన్ని అంతం చేస్తేనేఈ సమస్యలకు పరిష్కారం లభించదని భార్య తరుపు వారు భావించారు. 2020లో తెనాలి న్యాయస్థానంలో కేసు వాయిదాకు వచ్చిన సమయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. కరోనా కారణంగా గత కొంతకాలంగా సుబ్బయ్య ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారు.
గతేడాది డిసెంబరు 31న కోర్టు కేసు వాయిదాకు పొన్నూరు నుంచి ద్విచక్రవాహనంపై తెనాలి వచ్చిన సుబ్బయ్య వాయిదా పూర్తి చేసుకుని తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో అతణ్ని మామ రవి, అతని కుమారులు సుధాకర్, జయచంద్ర, వారి బంధువులు రమేశ్, సతీశ్ బాబు కారు, ద్విచక్ర వాహనాలపై అడ్డగించారు. యలవర్రు వంతెన వద్ద సుబ్బయ్యపై దాడి చేశారు. కారులోకి లాగి కండువాతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు.
వాయిదాకు తెనాలి వచ్చిన సుబ్బయ్య.. తిరిగి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు జనవరి 2న తెనాలి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతికతను వినియోగించి, కేసును ఛేదించారు. ఘటనను పునర్‌నిర్మించే క్రమంలో ఘటనా స్థలం 0 నుంచి మృతుడి చెప్పులు, బూడిద, ఎముకలు, నిందితుడి హెల్మెట్ వంటి ఆధారాలను సేకరించారు. కేసులో ఏ1గా ఉన్న బావమరిది పులివర్తి సుధాకర్ న్యాయవాది. కారు, ద్విచక్ర వాహనాలను సీˆజ్ చేశారు. ఘటనలో హతుడి భార్యకు ఎలాంటి ప్రమేయం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.
Also Read
Justice Pushpa Ganediwala: వివాదాస్పద తీర్పుల జడ్జి రాజీనామా.. ఒక రోజు మిగిలి ఉండగానే..
Road Accident: చిన్నారిని చిదిమేసిన చక్రాలు.. కన్న తల్లి కళ్లెదుటే ఘోరం