Siddharth: సింపుల్‏గా కనిపిస్తున్న చాలా కాస్ట్లీ.. పెళ్లిలో ‘ఆడెమర్స్ పిగ్యెట్ వాచ్’ పెట్టుకున్న సిద్ధార్థ్.. ధర ఎంతంటే..

వనపర్తిలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరగ్గా.. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది అదితి. దీంతో నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలిపారు.

Siddharth: సింపుల్‏గా కనిపిస్తున్న చాలా కాస్ట్లీ.. పెళ్లిలో 'ఆడెమర్స్ పిగ్యెట్ వాచ్' పెట్టుకున్న సిద్ధార్థ్.. ధర ఎంతంటే..
Siddharth
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 19, 2024 | 8:02 AM

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే వనపర్తిలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరగ్గా.. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది అదితి. దీంతో నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి వేడుకలలో సిద్ధార్థ్, అదితి లుక్స్ అందరిని ఫిదా చేశాయి. సింపుల్ గా కనిపిస్తూనే మరింత అందంగా మెరిసిపోయారు. అదితి రూబీ, బంగారు ఆభరణాలతో అలంకరించిన గోల్డెన్ ఆర్గాన్జా లెహంగాలో యువరాణిలా మెరిసిపోయింది.

ఇక సిద్ధార్థ్.. కుర్తా, వేష్ఠి ధరించి సింపుల్ గా కనిపించారు. సిద్ధార్థ్, అదితి ఫోటోస్ గత నాలుగు రోజులుగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో సిద్దార్థ్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రౌన్ బెల్ట్, గెల్డెన్ వాచ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సిద్ధార్థ్ ధరించిన గోల్డ్ కేస్‌తో కూడిన ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచ్‌ ధర రూ.27.62 లక్షలు అని సమాచారం. సింపుల్ గా కనిపిస్తున్న ఆ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

తమ పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ అందమైన కొటేషన్ రాసింది అదితి. “నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు మరియు నా నక్షత్రాలన్నీ… శాశ్వతత్వం కోసం పిక్సీ సోల్‌మేట్స్‌గా ఉండటానికి.. నవ్వడానికి, ఎప్పటికీ ఎదిగే శాశ్వతమైన ప్రేమకు, కాంతికి & మ్యాజిక్ శ్రీమతి & మిస్టర్ అదు-సిద్ధు” అంటూ రాసుకొచ్చింది. సిద్ధార్థ్ , అదితి ఇద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.