AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvvostanante Nenoddantana: సిద్ధార్థ్ మరో సూపర్ హిట్ రీరిలీజ్.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ఎప్పుడంటే..

మొన్నటివరకు సిద్ధార్థ్ నటించిన 'ఓయ్' సినిమా థియేటర్లలో అలరించింది. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ మళ్లీ విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. రీరిలీజ్ చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అందుకే మరో కల్ట్ క్లాసిక్ రొమాన్స్ మళ్లీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అదే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ ఐకానిక్ లవ్ స్టోరీని మళ్లీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Nuvvostanante Nenoddantana: సిద్ధార్థ్ మరో సూపర్ హిట్ రీరిలీజ్.. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఎప్పుడంటే..
Nuvvostanante Nenoddantana
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2024 | 6:51 AM

Share

గతవారం వాలెంటైన్స్ వీక్ సందర్భంగా సూపర్ హిట్ ప్రేమకథ చిత్రాలు మరోసారి థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు విడుదలైన సినిమాలనే మళ్లీ రిలీజ్ చేయగా.. అడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడే అధిక వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో రీరిలీజ్ ట్రెండ్ రోజు రోజుకీ మరింత పెరుగుతుంది. మొన్నటివరకు సిద్ధార్థ్ నటించిన ‘ఓయ్’ సినిమా థియేటర్లలో అలరించింది. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ మళ్లీ విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. రీరిలీజ్ చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అందుకే మరో కల్ట్ క్లాసిక్ రొమాన్స్ మళ్లీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అదే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ ఐకానిక్ లవ్ స్టోరీని మళ్లీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17, 18 తేదీల్లో మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఇప్పుడు క్విట్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ రీ-రిలీజ్‌ చేస్తుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా 2005లో విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి. రొమాంటిక్/కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈచిత్రాన్ని కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించారు. NRI సంతోష్ తన కజిన్ పెళ్లికి హాజరయ్యేందుకు లండన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తాడు. అక్కడ అతను సిరి అనే పల్లెటూరి అమ్మాయిని కలుస్తాడు. అల్లరి గొడవలతో మొదలైన వారిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే సిరి పల్లెటూరి అమ్మాయి కావడంతో అతని ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు. తన ప్రేమను వెతుక్కుంటూ వెళ్లే సంతోష్‌ను ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సిరి సోదరుడి ముందు తాను అర్హుడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. చివరకు అతడు గెలిచాడా ?లేదా? అనేది సినిమా.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రలలో నటించారు. దివంగత శ్రీహరి, సునీల్, అర్చన శాస్త్రి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరో రొమాంటిక్ కల్ట్ హిట్ మైనే ప్యార్ కియా నుంచి ఈ మూవీ ప్రేరణ పొందింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మళ్లీ రిలీజ్ అవుతుండడంతో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.