AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Apte: టాలీవుడ్ ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన కామెంట్స్.. సినిమాల్లో వాళ్లదే ఆదిపత్యం అంటూ..

ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అయితే నిత్యం ఈ బ్యూటీ ఏదొక విషయంపై వార్తలలో నిలుస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అందులో తెలుగు సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసింది.

Radhika Apte: టాలీవుడ్ ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన కామెంట్స్.. సినిమాల్లో వాళ్లదే ఆదిపత్యం అంటూ..
Radhika Apte
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2024 | 7:25 AM

Share

తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు రాధిక ఆప్టే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత లెజెండ్, లయన్ సినిమాల్లో నటించి అలరించింది. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అయితే నిత్యం ఈ బ్యూటీ ఏదొక విషయంపై వార్తలలో నిలుస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అందులో తెలుగు సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక మాట్లాడుతూ.. “నేను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ తెలుగు. ఎందుకంటే ఆ పరిశ్రమ చాలా పితృస్వామికమైనది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పురుషాధిక్యత ఎక్కువగా ఉంది. పురుషులు గుడ్డి జాతీయవాదులు. అక్కడ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అసహనంగా ఉంది. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. సెట్ లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. అక్కడ నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను. ఏం చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు షూట్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడ నా అవసరం కొంతవరకే అని గ్రహించా” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు రాధిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. టాలీవుడ్ మూవీ లవర్స్ ఈ హీరోయిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాధికా ఆప్టే హిందీ, తమిళం, తెలుగుతో సహా అనేక భారతీయ భాషలలో చిత్రాలలో నటించింది. ‘తెలుగు సినిమాల్లో నా పాత్ర మనిషి దేవుడిలా ఉంటుంది. సెట్ లో మమ్మల్ని మూడో మనిషిలా చూస్తారు. నటీనటులను ఏమి అడగుకుండానే.. హీరోకు నచ్చినట్లుగా షూటింగ్ క్యాన్సల్ చేస్తారు. రోజూ ఎంతో కష్టపడ్డాను.. ఇప్పుడు దానిని వదులుకున్నాను. ‘ అని తెలిపింది. అయితే రాధిక కామెంట్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆమె కావాలని తెలుగు సినీ పరిశ్రమ పరువు తీసేందుకు ప్రయత్నిస్తుందని.. సినీ పరిశ్రమ ప్రతిష్ట మసకబారకూడదని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.