స్టాండప్ కమెడియన్‌గా శశిథరూర్..పంచ్‌లు వేస్తోన్న నెటిజన్స్
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ త్వరలోనే కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. రాజకియాల్లో సీనియర్ నేతగా, రచయితగా, ఇంగ్లీష్ భాషపై అసమాన్య పట్టున్న వ్యక్తిగా పేరున్న ఆయన త్వరలోనే యాక్టర్‌గా దర్శనమివ్వబోతున్నారు. అది కూడా స్టాండప్ కామెడీ చెయ్యబోతున్నారట. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజయ్యి..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ‘వన్ మైక్ స్టాండ్’ పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ నవంబర్ 15న అందుబాటులోకి రానుంది. కాగా గతంలోనూ శశి థరూర్.. నెట్‌ఫ్లిక్స్ వారు తీసిన ‘పేట్రియాట్ […]
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ త్వరలోనే కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. రాజకియాల్లో సీనియర్ నేతగా, రచయితగా, ఇంగ్లీష్ భాషపై అసమాన్య పట్టున్న వ్యక్తిగా పేరున్న ఆయన త్వరలోనే యాక్టర్‌గా దర్శనమివ్వబోతున్నారు. అది కూడా స్టాండప్ కామెడీ చెయ్యబోతున్నారట. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజయ్యి..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ‘వన్ మైక్ స్టాండ్’ పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ నవంబర్ 15న అందుబాటులోకి రానుంది.
కాగా గతంలోనూ శశి థరూర్.. నెట్‌ఫ్లిక్స్ వారు తీసిన ‘పేట్రియాట్ యాక్ట్’ లోనూ కనిపించారు. మంచి వ్యాఖ్యాతగా పేరున్న శశిథరూర్‌కి ఈ రోల్ పెద్దగా ఛాలెంజింగ్‌గా అనిపించకపోవచ్చు. మాములుగానే ఆయన స్పీచ్‌లలో కంటెంట్‌తో పాటు కాస్త కామెడీ టచ్ కూడా ఉంటుంది. కాగా శశిథరూర్ కామెడీని అర్థం చేసుకోవాలటే ముందుగా..డిక్షనరీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా ఈ షోలో 5గురు సెలబ్రిటీలు..మరో ఐదుగురు ప్రొఫెషనల్ యాక్టర్స్‌తో పోటీపడనున్నారు.
Sneak preview of a minute of my stand-up comedy act (it does get better later!) #OneMicStand pic.twitter.com/tgXVZEYOir
— Shashi Tharoor (@ShashiTharoor) November 13, 2019