‘జబర్దస్త్’ నుంచి నాగబాబు, ‘పటాస్’ నుంచి రవి ఔట్..?

‘జబర్దస్త్’, ‘పటాస్’..కామెడీ షోలు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకున్నాయి. సంవత్సరాలు గడుస్తోన్న కొద్ది.. కొత్త కంటెంట్‌తో, టాప్ రేటింగ్స్‌తో సత్తా చాటుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాల వీక్షకులకు షాకింగ్ న్యూస్. అది ఏంటంటే..’పటాస్’ నుంచి స్టార్ యాంకర్ రవి…. ‘జబర్దస్త్’ నుంచి మెగా జడ్జ్ నాగబాబు బయటకి వెళ్లారట. ఇకపై ఈ కార్యక్రమాల్లో సదరు సెలబ్రిటీలు కనిపించరని సమాచారం. ప్రస్తుతం బ్యాక్ అప్ పెట్టుకున్న ఎపిసోడ్స్ ఉండటం వల్ల..ప్రస్తుతానికి వారు కనిపిస్తున్నారని..ఇప్పటికే సదరు స్టార్స్ […]

'జబర్దస్త్' నుంచి నాగబాబు, 'పటాస్' నుంచి రవి ఔట్..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2019 | 8:20 PM

‘జబర్దస్త్’, ‘పటాస్’..కామెడీ షోలు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకున్నాయి. సంవత్సరాలు గడుస్తోన్న కొద్ది.. కొత్త కంటెంట్‌తో, టాప్ రేటింగ్స్‌తో సత్తా చాటుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాల వీక్షకులకు షాకింగ్ న్యూస్. అది ఏంటంటే..’పటాస్’ నుంచి స్టార్ యాంకర్ రవి…. ‘జబర్దస్త్’ నుంచి మెగా జడ్జ్ నాగబాబు బయటకి వెళ్లారట. ఇకపై ఈ కార్యక్రమాల్లో సదరు సెలబ్రిటీలు కనిపించరని సమాచారం. ప్రస్తుతం బ్యాక్ అప్ పెట్టుకున్న ఎపిసోడ్స్ ఉండటం వల్ల..ప్రస్తుతానికి వారు కనిపిస్తున్నారని..ఇప్పటికే సదరు స్టార్స్ లేకుండానే ప్రొగ్రామ్స్ షూటింగ్స్ కూాడా జరిగిపోయాయని టాక్.

రవి ఎందుకు ఔట్ అయ్యాడంటే..?

వాస్తవానికి మేల్ యాంకర్లలో రవికి సెపరేట్ గుర్తింపు ఉంది. కాస్త బోల్డ్‌ పంచ్‌‌లు వెయ్యడం, లేడీ యాంకర్లతో మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకోవడం రవి స్టైల్. అయితే ‘పటాస్’కి మాత్రమే కాకుండా మరో శాటిలైట్ ఛానల్‌తో కూడా రవి అగ్రిమెంట్ చేసుకున్నాడట. షోని ఆర్గనైజ్ చేస్తోన్న మల్లెమాల సంస్థ.. అలా వద్దని చెప్పడంతోనే..రవి నిష్క్రమించినట్టు సమాచారం. ఇక రవి స్థానంలో యాంకర్‌గా.. కమెడియన్ చంటి లేదా సింగర్ కమ్ యాక్టర్ నోయల్‌ పరిశీలిస్తున్నట్టు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

నాగబాబు బయటకు వెళ్లడానికి కారణాలు:

‘జబర్దస్త్”…అంటే నవ్వుల నవాబ్ నాగబాబు ప్రత్యేక ఆకర్షణ. ఆయన స్మైల్‌కి, స్కిట్ మధ్యలో వేసే పంచ్‌లకి జనాలు బాగా కనెక్టయ్యారు. అయితే ‘జబర్దస్త్’ ను ఇంతకాలం నితిన్-భరత్‌లు డైరెక్ట్ చేశారు. తాజాగా ఆర్గనైజింగ్ సంస్థతో విభేదాలు రావడంతో వారు తప్పుకున్నారు. సదరు డైరెక్టర్లతో మంచి సాన్నిహిత్యం ఉన్న నాగబాబు..హర్ట్ అయ్యి వెళ్లిపోయారని టాక్. ఇక చమ్మక్ చంద్ర కూడా నాగబాబు బాటలోనే పయనిస్తన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ కామెడీ కార్యక్రమాలు వీక్షించే ప్రేక్షకులను తాజా పరిణామాలు షాక్‌కు గురి చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.