వరుణ్ తల్లిగా శివగామి.. తండ్రిగా స్టార్ హీరో..?

ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఈ ఏడాది వరుస రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోరు మీదున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ లోపు నటీనటులను ఎంపిక చేస్తోన్న దర్శకుడు వరుణ్ తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక కథను మెచ్చిన […]

వరుణ్ తల్లిగా శివగామి.. తండ్రిగా స్టార్ హీరో..?
Follow us
Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Nov 16, 2019 | 2:25 PM

ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఈ ఏడాది వరుస రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోరు మీదున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ లోపు నటీనటులను ఎంపిక చేస్తోన్న దర్శకుడు వరుణ్ తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక కథను మెచ్చిన రమ్యకృష్ణ ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు కూడా సమాచారం. ఇక తండ్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్‌ నటించబోతున్నట్లు టాక్.

సవ్యసాచితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవన్.. ఇక్కడ వరుస ఆఫర్లను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన క్రేజ్ దృష్ట్యా వరుణ్ సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. అలాగే మాధవన్ నటిస్తే.. ఈ మూవీని తమిళ్‌లో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ భావించిందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్ ముద్ద నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.