S. Shankar: స్పీడ్ పెంచిన శంకర్.. రామ్ చరణ్ తర్వాత ఆ హీరోలతో సినిమాలు
ఆల్రెడీ చరణ్, కమల్ ఉండగానే.. మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు ఈ దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అది కూడా పొలిటికల్ సినిమానే. మరింతకీ ఏంటా సినిమా..? అందులో హీరో ఎవరు..? నిజంగానే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ స్పీడ్ చూసి ఆయన వీరాభిమానులు కూడా పరేషాన్ అవుతున్నారు.

ఎలా ఉండే శంకర్ ఎలా అయిపోయాడు.. అప్పట్లో ఒక్క సినిమా కోసం మూడేళ్ళు తీసుకునేవాడు.. కానీ ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నాడు..! బయట శంకర్ గురించి నడిచే టాపిక్ ఇదే. ఆల్రెడీ చరణ్, కమల్ ఉండగానే.. మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు ఈ దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అది కూడా పొలిటికల్ సినిమానే. మరింతకీ ఏంటా సినిమా..? అందులో హీరో ఎవరు..? నిజంగానే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ స్పీడ్ చూసి ఆయన వీరాభిమానులు కూడా పరేషాన్ అవుతున్నారు. అరే.. 30 ఏళ్ళ కెరీర్‌లో ఆయన చేసిన సినిమాలు 13 మాత్రమే అంటే.. ఒక్కో సినిమా కోసం శంకర్ ఎంత టైమ్ తీసుకున్నారో.. తీసుకుంటారో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిదిప్పుడు ఒకేసారి ఓవైపు గేమ్ ఛేంజర్.. మరోవైపు ఇండియన్ 2 సైమంటేనియస్‌గా చేస్తున్నారు ఈ దర్శకుడు.
గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ప్రస్తుతం ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు శంకర్. దీని తర్వాత మళ్లీ ఇండియన్ 2కి షిఫ్ట్ కానున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం శంకర్ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్. ఇదాయన స్టైల్ కాదు కానీ చేస్తున్నారు. పైగా రెండూ పొలిటికల్ సినిమాలే. వీటితో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ రణ్‌వీర్ సింగ్‌తో కమిటయ్యారు శంకర్.
ఇవన్నీ ఉండగానే.. తాజాగా శంకర్, విజయ్ కాంబినేషన్‌లో భారీ పొలిటికల్ థ్రిల్లర్ రాబోతుందనే ప్రచారం తమిళ మీడియాలో ఊపందుకుంది. ప్రస్తుతం విజయ్ పొలిటికల్ మూడ్‌లోనే ఉన్నారు. లియో షూటింగ్ పూర్తి కాగానే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌ను కలుసుకున్నారు. అంతేకాదు పాదయాత్ర కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్ట్స్ ఎలక్షన్స్‌ను సీరియస్‌గా తీసుకున్నారు విజయ్.
విజయ్ నెక్ట్స్ సినిమా వెంకట్ ప్రభుతో ఫిక్సైపోయింది. దీని తర్వాత శంకర్ దర్శకత్వంలో తన పొలిటికల్ ఎంట్రీకి పనికొచ్చేలా ఓ సినిమా చేయాలనుకుంటున్నారు విజయ్. ఇప్పటికే లైన్ కూడా రెడీ అయిపోయిందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ స్నేహితుడు సినిమా చేసారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్, అపరిచితుడు రీమేక్ తర్వాతే.. విజయ్, శంకర్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది.




