Pawan Kalyan: జెట్ స్పీడ్‌లో పవన్ సినిమా షూటింగ్.. చివరి దశలో పవర్ స్టార్ ఓజీ
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా పొలిటికల్ మూడ్‌లో ఉన్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇప్పట్లో సినిమా అనే పదమే ఆయన నోట్లోంచి వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికలకు ఏడాది కూడా లేకపోవడంతో జనంలోకి వెళ్లిపోతున్నారు జనసేనాని.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నా కేవలం ఓజి మాత్రమే ఎందుకు ముందుకు కదులుతుంది..? మిగిలిన రెండు సినిమాల షూటింగ్స్‌లో పెద్దగా అప్‌డేట్ లేకపోయినా.. ఓజి ఒక్కటే అంత వేగంగా ఎలా పూర్తవుతుంది..? మిగిలిన సినిమాలకు ఇవ్వని డేట్స్ సుజీత్ సినిమాకు మాత్రమే పవన్ ఇస్తారా..? అసలు ఓజిలో ఉన్నది.. మిగిలిన సినిమాల్లో లేనిది ఏంటి..? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా పొలిటికల్ మూడ్‌లో ఉన్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇప్పట్లో సినిమా అనే పదమే ఆయన నోట్లోంచి వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికలకు ఏడాది కూడా లేకపోవడంతో జనంలోకి వెళ్లిపోతున్నారు జనసేనాని. కానీ ఆయన్ని నమ్ముకుని మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయిప్పుడు. అందులో ఓజి మాత్రమే ముందుకు వేగంగా కదులుతుంది.
సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. పవన్ లేకపోయినా.. మేజర్ కాస్ట్ అండ్ క్య్రూ అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. జులై అంతా ఓజి షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. పవన్ ఎప్పుడొచ్చి జాయిన్ అవుతారనేది నిర్మాతలకు కూడా తెలియదు. ఎప్పుడొచ్చినా 15 రోజుల్లో పని పూర్తి చేయాలని చూస్తున్నారు సుజీత్. పైగా ఓజిలో పవన్ స్క్రీన్ స్పేస్ 40 నిమిషాలకు మించదు.
40 నిమిషాలే ఉన్నా.. సినిమా అంతా ఉన్న ఫీల్ కలిగేలా కారక్టరైజేషన్ ప్లాన్ చేస్తున్నారు సుజీత్. బ్రో సినిమాను 22 రోజుల్లో పూర్తి చేసిన పవన్.. ఓజిని 35 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే 20 రోజుల షెడ్యూల్ డన్.. మరో 15 రోజులు చేస్తే లెక్క సరిపోతుంది. రెండు భాగాలుగా వస్తుంది ఓజి.. పార్ట్ 2 ఎన్నికల తర్వాత రానుంది. అన్నీ కుదిర్తే డిసెంబర్‌లోనే ఓజి ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.




