Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో మొదటి ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వచ్చింది ఎవరంటే
తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోన్న విషయం తెలిసిందే. గొడవలు , ఏడుపులు, అలకలతో బిగ్ బాస్ హౌస్ నిండిపోయింది.
తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 Telugu) రసవత్తరంగా సాగుతోన్న విషయం తెలిసిందే. గొడవలు , ఏడుపులు, అలకలతో బిగ్ బాస్ హౌస్ నిండిపోయింది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో హౌస్ మేట్స్ తమ శక్తిమేర ఆడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం గేమ్ ఆడకుండా కేవలం తినడానికి బతకాని పెట్టడానికే వచ్చారంటూ నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున చివాట్లు పెట్టారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పి క్లాస్ తీసుకున్నారు నాగ్. నాగార్జున కూడా మస్త్ ఫైర్ మీద కనిపించాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరినా రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఇలా తొమ్మింది మందిని పక్కన పెట్టి అసలు గేమ్ ఆడటానికి వచ్చారా లేక తినడానికి టైం పాస్ కి వచ్చారా అని సీరియస్ అయ్యాడు నాగ్.
రేవంత్ గురించి చెప్తూ.. కోపం తగ్గించుకున్నావ్ కానీ పక్కన వాళ్లకి సలహాలు, నీతులు చెప్పకు.. నువ్వేమైనా తోపువా? బొట్టు పెట్టుకుంటే.. నచ్చుతారు.. ఇలా తయారవ్వాలి.. మనుషులు ఇలా ఉండాలి.. అని చెబుతున్నావ్.. అందరినీ కరెక్ట్ చేయడం ఆపేయ్.. నిన్ను నువ్ కరెక్ట్ చేసుకో.. నీ స్నేహితులతో చేసే ఫన్ బాగుంటుంది.. ఒక హద్దు ఉంటుంది.. అందరినీ దగ్గరకు చేసుకుందామని వచ్చావ్.. దూరం చేసుకోవడానికి కాదు.. ఆట మాత్రం ఇరగదీశావ్ అంటూ తిడుతూనే పొగిడేశాడు నాగార్జున. ఇక హౌస్ లో వరస్ట్ కంటెస్టెంట్ గా ఎవరిని ఎంచుకుంటారు అని నాగ్ చెప్పగా.. శ్రీ సత్య, షాని, వాసంతి లను ఎంచుకున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెపుతూనే షాని ని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశాడు నాగార్జున. ఇక ఇంటి సభ్యుల ఓటింగ్, ఆడియెన్స్ ఓటింగ్‌లతో మ్యాచ్ అయిందని షానీని ఎలిమినేట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..