అప్పట్లో అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఉండే క్రేజే వేరు.. చాలా మంది భామలు హీరోలతో పోటీ పడి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే కేరీర్ బిగినింగ్ లో చాలా మంది భామలు ఎన్నో కష్టాలుపడి హీరోయిన్స్ గా ఎదిగారు. ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. ఆడిషన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరిగింది.

హీరోయిన్స్ గా రాణించాలంటే అందం, అభినయం మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలి. ఎంతో కష్టపడి హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్న వారు ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. హీరోల్లోనే కాదు.. హీరోయిన్స్ లోనూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండ వచ్చి సక్సెస్ అయినా వారు చాలా మంది ఉన్నారు. అయితే కెరీర్ బిగినింగ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఎన్నో కష్టాలు పడ్డాం అని పలు సందర్భాల్లో చెప్పారు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఓ హీరోయిన్ సినిమాల పై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయి ఎన్నో కష్టాలు పడింది. అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పై ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న వయ్యారి భామ షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ 2017లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో షాలిని ప్రీతి అనే పాత్రను పోషించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు మాట్లాడడం రానప్పటికీ, ఈ సినిమా కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో షాలిని ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఆ తర్వాత ఆమె తెలుగులో మహానటి , 118 , ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం (2020) వంటి చిత్రాల్లో నటించింది. మహానటిలో సావిత్రి స్నేహితురాలి పాత్రలో ఆమె నటన గుర్తింపు పొందింది. తమిళంలో 100% కాదల్, హిందీలో జయేష్‌భాయ్ జోర్దార్, మహారాజ్ వంటి సినిమాల్లో కూడా ఆమె తన నటనా ప్రతిభను చూపించింది. జయేష్‌భాయ్ జోర్దార్ కోసం ఆమె స్లిమ్‌గా మారి అందరిని ఆకట్టుకుంది. కాగా కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది చాలా కష్టాలను చూసింది. సినిమాల్లో నటించడానికి తండ్రి ఒప్పుకోకపోవడమతొ ఇంట్లో నుంచి పారిపోయింది. ఆతర్వాత అబ్బాయిలతో కలిసి రూమ్ షేర్ చేసుకుంది. ఆఫర్స్ కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు హీరోయిన్ గా మారి తన ప్రతిభను చాటుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.