Shahid Kapoor: అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..

జిమ్ కు వెళ్లినా.., ఈవెంట్స్ కు వెళ్లినా.. పార్టీస్ కు వెళ్లినా.. ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటారు. కొంతమంది సహనంతో ఫోటోలకు ఫోజులిస్తే మరికొంతమంది ఫోటో గ్రాఫర్స్ పై ఫైర్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఫోటోగ్రాఫర్స్ పై ఫైర్ అయ్యాడు. తన భార్య ఫోటోలు తీసుతున్నందుకు మనోడికి కోపం వచ్చింది. 

Shahid Kapoor: అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
Shahid Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2024 | 4:47 PM

సెలబ్రెటీలు బయట కనిపిస్తే చాలు ఫొటోగ్రాఫర్లు కెమెరాలు పట్టుకొని రెడీగా ఉంటారు. బాలీవుడ్ లో ఇది మరీ ఎక్కువగా ఉంటుది. హీరోయిన్స్ పొరపాటున బయట కనిపిస్తే చాలు ఫోటోలు క్లిక్ మనిపిస్తారు. జిమ్ కు వెళ్లినా.., ఈవెంట్స్ కు వెళ్లినా.. పార్టీస్ కు వెళ్లినా.. ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటారు. కొంతమంది సహనంతో ఫోటోలకు ఫోజులిస్తే మరికొంతమంది ఫోటో గ్రాఫర్స్ పై ఫైర్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఫోటోగ్రాఫర్స్ పై ఫైర్ అయ్యాడు. తన భార్య ఫోటోలు తీసుతున్నందుకు మనోడికి కోపం వచ్చింది.

నటుడు షాహిద్ కపూర్‌కి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినప్పటికీ.. అతను ఓ ఫ్యామిలీ స్టార్. కుటుంబం కోసం ఆయన కావాల్సినంత టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు..  భార్య, పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతాడు. చాలా సందర్భాలలో అతను ముంబైలోని రెస్టారెంట్లలో కనిపించాడు.  ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫొటోగ్రాఫర్లు వారిని ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు షాహిద్ కపూర్‌కు కోపం తెప్పించింది కూడా. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. తన భార్య మీరా రాజ్‌పుత్‌తో వచ్చిన షాహిద్ కపూర్‌ ను ఫోటో గ్రాఫర్లు చుట్టుముట్టారు.

షాహిద్ కపూర్ , మీరా రాజ్‌పుత్ రెస్టారెంట్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ గుమిగూడారు. అప్పుడు షాహిద్ కపూర్ కి చాలా కోపం వచ్చింది. అతను వారి పై అసహనం వ్యక్తం చేశాడు.  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు షాహిద్ కపూర్‌కు మద్దతు ఇస్తున్నారు. షాహిద్ కపూర్ తన భార్య ఫోటో తీయడానికి వచ్చిన కెమెరామెన్స్ పై రెచ్చిపోయాడు. ‘దీన్ని ఆపేస్తావా? దయచేసి సరిగ్గా ప్రవర్తించండి’ అని షాహిద్ కపూర్ అన్నారు. ‘కబీర్ సింగ్ నిజజీవితంలో కూడా తన పాత్రలాగే చేస్తున్నాడు’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ , మీరా రాజ్‌పుత్ జూలై 2015లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు షాహిద్ కపూర్ కరీనా కపూర్‌తో ప్రేమాయణం నడిపాడు. షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లకు ఏడేళ్ల కుమార్తె మిషా, నాలుగేళ్ల కుమారుడు జైన్ ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పుడు షాహిద్ కపూర్ ‘దేవా’లో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.