పవన్, చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు
కంచరపాలెం సినిమాలో అద్భుతంగా నటించారు కిశోర్ కుమార్. ఆ సినిమాలో ఓ మూగ వ్యక్తిగా నటించి మెప్పించాడు. ఆతర్వాత కిశోర్ కుమార్ పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారాడు కిశోర్ కుమార్. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
చిన్న సినిమాగా వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు కిశోర్ కుమార్. ఆయన పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమేమో గాని ఆయనను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. కంచరపాలెం సినిమాలో అద్భుతంగా నటించారు కిశోర్ కుమార్. ఆ సినిమాలో ఓ మూగ వ్యక్తిగా నటించి మెప్పించాడు. ఆతర్వాత కిశోర్ కుమార్ పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారాడు కిశోర్ కుమార్. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల వల్ల తనకు అన్యాయం జరిగిందని అన్నారు కిశోర్ కుమార్. ఇంతకు మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల వల్ల ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి.? ఎందుకు ఆయన ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు చూద్దాం..
చిరంజీవి ఆచార్య, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాల్లో తనకు అన్యాయం జరిగిందని అన్నారు కిశోర్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిశోర్ కుమార్. ఆచార్య సినిమాలో, భీమ్లా నాయక్ సినిమాల్లో తాను నటించానని తెలిపారు. అయితే ఆ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాకా తన సీన్స్ లేవని.. తన సీన్స్ ను ఎందుకు తీసేశారో అర్ధం కాలేదు అని అన్నారు. తన సీన్స్ ను తీసెయ్యడంతో చాలా బాదపడ్డానని తెలిపారు కిశోర్ కుమార్. ఆచార్య సినిమాకోసం నేను 20 రోజులు పని చేశా.. మంచి పాత్ర దక్కింది. బాగా చేశానని చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారు. కానీ సినిమాలో ఆ సీన్స్ తీసేసారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. ఆతర్వాత కొంచం గ్యాప్ వచ్చింది. ఆతర్వాత నేను షూటింగ్ కు వెళ్తే నా ప్లేస్ లో వేరే నటుడిని పెట్టేశారు. అసలు ఎందుకు అలా చేశారో నాకు అర్ధం కాలేదు. ఈ రెండు సినిమాల్లో తనకు అన్యాయం జరిగిందని దాంతో చాలా బాధపడ్డాను అని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.