Dunki Movie : దారుణంగా పడిపోయిన షారుఖ్ ఖాన్ డంకీ కలెక్షన్స్.. రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. షారుఖ్ ఖాన్ మాస్ అవతార్ వదిలి 'డంకీ' సినిమాలో క్లాస్‌గా కనిపించాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ప్రదర్శన కనబరుస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండవ రోజు అంటే డిసెంబర్ 22 కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ఈ రెండు సినిమాలు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కానీ ‘డంకీ’ సినిమాలో షారుఖ్ క్లాస్‌గా కనిపించాడు. ఈ సినిమాలో ఫైట్లు లేవు. దీంతో సినిమా వసూళ్లు స్లోగా సాగుతున్నాయి. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. షారుఖ్ ఖాన్ మాస్ అవతార్ వదిలి ‘డంకీ’ సినిమాలో క్లాస్‌గా కనిపించాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ప్రదర్శన కనబరుస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండవ రోజు అంటే డిసెంబర్ 22 కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం అనుమానంగానే కనిపిస్తుంది.
‘డంకీ’ సినిమా తొలిరోజు 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు రూ.19.20 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఫారిన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. వీకెండ్‌లో సినిమా ఎలా వసూళ్లు సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది.
శని, ఆది, సోమవారాలు క్రిస్మస్ సెలవులుకావడంతో సినిమాకు ముఖ్యమైనవి. ఈ రోజుల్లో సినిమాలు మంచి వసూళ్లు సాధించాలి. పఠాన్, జవాన్ సినిమాలు రెండు వెయ్యి కోట్లు వసూల్ చేశాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పర్లేదు అనిపించుకున్నా.. మిగిలిన ఏరియాల్లో మాత్రం డంకీ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ చిత్రానికి ప్రభాస్ నటించిన ‘సలార్’ నుండి గట్టి పోటీ ఇస్తుంది. సలార్ సినిమా తొలి రోజే ఏకంగా 170కోట్ల వరకు వసూల్ చేసింది.
షారుఖ్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
Thank u my friends in Vapi…. My Bandas… Apne families ke saath bhi dekhlo!!! Ha ha https://t.co/yybDBVMQ4i
— Shah Rukh Khan (@iamsrk) December 22, 2023
షారుఖ్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
Thank u my man…. U are awesome!!! Big hug https://t.co/EAxMjjRuuT
— Shah Rukh Khan (@iamsrk) December 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.