Salaar Vs Dunki: దటీజ్ ప్రభాస్..! సలార్ vs డంకీ విషయంలో దిగొచ్చిన PVR థియేటర్స్.
ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోస్.. రెండు భారీ బడ్జెట్ చిత్రాలు. ఒకేసారి విడుదలైతే సినీ పరిశ్రమకుప్ పెద్ద దెబ్బే. అంతేకాదు.. అటు అభిమానులకు సైతం అయోమయమే. ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం వల్ల ఇటు కలెక్షన్స్ తగ్గే అవకాశం లేకపోలేదు. ఆ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఎవరో కాదు… బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోస్.. రెండు భారీ బడ్జెట్ చిత్రాలు. ఒకేసారి విడుదలైతే సినీ పరిశ్రమకుప్ పెద్ద దెబ్బే. అంతేకాదు.. అటు అభిమానులకు సైతం అయోమయమే. ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం వల్ల ఇటు కలెక్షన్స్ తగ్గే అవకాశం లేకపోలేదు. ఆ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఎవరో కాదు… బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకేసారి అడియన్స్ ముందుకు వచ్చారు. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. డంకీ సినిమా కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అయ్యింది. కానీ సలార్ మాత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది. రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఒకేసారి విడుదలకావడంతో థియేటర్స్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ కాస్త పీవీఆర్ కు సమస్యగా మారింది.
ఇక అసలు విషయం ఏంటంటే..! అంతకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం నార్త్ లో సలార్ సినిమాకు పీవీఆర్ స్క్రీన్స్ ఇవ్వమని చెప్పారట. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. షారుఖ్, డంకీ సినిమా నిర్మాతలు సలార్ మూవీకి నార్త్ లో థియేటర్స్ ఇవ్వొద్దని పీవీఆర్ ఓనర్ తో మాట్లాడి డీల్ చేసుకున్నట్లు ప్రచారం నడిచింది. ఇక అదే జరిగితే.. సౌత్ లోనూ పీవీఆర్ లో సలార్ సినిమా వేయమని డిసైడ్ అయినట్లు టాక్. ఇటు సేల్ అయిన టికెట్స్ లిస్ట్ పెట్టగా.. అందులో పీవీఆర్ సంస్థను మినహాయించి అని పోస్ట్ చేశారు. అటు పీవీఆర్ థియేటర్లలో నిన్నటివరకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దీంతో పీవీఆర్ బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.
దక్షిణాదిలో పీవీఆర్ లో సలార్ సినిమా వేయకపోతే ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో ఎట్టకేలకు పీవీఆర్ దిగొచ్చింది. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మొత్తం తప్పు అని.. సలార్ సినిమా పీవీఆర్ లోనూ రిలీజ్ అవుతుందని.. అలాగే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని.. బుక్ చేసుకోవాలని పోస్ట్ చేసింది పీవీఆర్. అటు దక్షిణాదిలో 70% షేరింగ్‌పై మల్టీప్లెక్స్‌లతో ఒప్పందం చేసుకున్న తర్వాత హోంబేల్ ప్రొడక్షన్స్ ఇప్పుడు నేషనల్ చైన్స్ బుకింగ్ ప్రారంభించింది. దీంతో ఉత్తరాదిలో నిలిచిపోయిన బుకింగ్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.