Jawan Collections: ప్రభాస్‌ రేంజ్‌ అట్లుంటది మరి.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను బీట్‌ చేయలేకపోయిన ‘జవాన్‌’

షారుక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, గెటప్స్‌, అట్లీ డైరెక్షన్‌, ఇక నయన్‌, దీపికల గ్లామర్‌.. ఇలా అన్నీ కలిసి రావడంతో జవాన్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దిశగా దూసుకెళుతోంది. మొదటి రోజే ఏకంగా రూ. 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జవాన్‌ విజయంతో చిత్రబృందంతో పాటు షారుక్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. వీకెండ్‌ కలిసి రావడంతో తమ హీరో సినిమా మరిన్ని రికార్డులు కొల్లగొడుతుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

Jawan Collections: ప్రభాస్‌ రేంజ్‌ అట్లుంటది మరి.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను బీట్‌ చేయలేకపోయిన 'జవాన్‌'
Shah Rukh Khan, Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2023 | 7:51 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ గురువారం (సెప్టెంబర్‌7) న గ్రాండ్‌ గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. షారుక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, గెటప్స్‌, అట్లీ డైరెక్షన్‌, ఇక నయన్‌, దీపికల గ్లామర్‌.. ఇలా అన్నీ కలిసి రావడంతో జవాన్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దిశగా దూసుకెళుతోంది. మొదటి రోజే ఏకంగా రూ. 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జవాన్‌ విజయంతో చిత్రబృందంతో పాటు షారుక్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. వీకెండ్‌ కలిసి రావడంతో తమ హీరో సినిమా మరిన్ని రికార్డులు కొల్లగొడుతుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అయితే షారుక్‌ జవాన్‌ రికార్డు కలెక్షన్లు సాధించినా ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్‌ రికార్డును అధిగమించలేకపోయాడు. అదేంటంటే ఫస్ట్‌ డే కలెక్షన్స్‌. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.136.84 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్ల సాధించిన సినిమా ఇదే. అంటే ప్రభాస్‌దే టాప్‌ ప్లేస్‌. ఈ క్రమంలో ఆదిపురుష్‌ రికార్డు తమ సలార్‌ సినిమానే బీట్‌ చేస్తుందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. కాగా ఆదిపురుష్‌ సినిమా ఓపెనింగ్స్‌ బాగానే ఉన్నా నెగెటివ్‌ టాక్‌ తో ఓవరాల్ గా రూ. 450కోట్లను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది

ఇక 2003లో రిలీజైన సినిమాల్లో టాప్‌- 5 కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఆదిపురుష్‌ 136.84 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే.. జవాన్‌ రూ. 129.6 కోట్లతో రెండో స్థానంలో ఉంది. పఠాన్‌ 106 కోట్లతో మూడో ప్లేస్‌లో, రజనీకాంత్ జైలర్‌ రూ. 95.78 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, పొన్నియన్‌ సెల్వన్‌ 2 రూ. 61.53 కోట్లతో ఐదో ప్లేస్‌లో కొనసాగుతోంది. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ మొదటిసారి బాలీవుడ్‌లో తెరకెక్కించిన చిత్రం జవాన్‌. ఈ సినిమాతోనే నయనతార కూడా హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. వీరితో పాటు మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సంజయ్‌ దత్‌ తదితరులు స్పెషల్‌ రోల్స్‌లో కనిపించారు. షారుక్‌ సొంత సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పై రూపొందిన జవాన్‌ సినిమాకు గౌరీఖాన్‌ దర్శకత్వం వహించారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ అందించిన బీజీఎమ్‌ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ ను బీట్ చేయలేకపోయిన జవాన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.